Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

ABN , First Publish Date - 2023-03-10T15:35:08+05:30 IST

‘దేవదాసు’ (Devadasu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఇలియానా డి క్రూజ్ (Ileana D'Cruz). ‘పోకిరి’ (Pokiri)తో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. కోలీవుడ్ ఇండస్ట్రీ ఆమెపై నిషేధం విధించిందని కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి.

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

‘దేవదాసు’ (Devadasu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఇలియానా డి క్రూజ్ (Ileana D'Cruz). ‘పోకిరి’ (Pokiri)తో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. కోలీవుడ్ ఇండస్ట్రీ ఆమెపై నిషేధం విధించిందని కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. గతంలో ఓ తమిళ సినిమాకు భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకుని షూటింగ్ చేయలేదని రూమర్స్ హల్‌చల్ చేశాయి. దీంతో చిత్ర నిర్మాత భారీ నష్టాల్లో కూరుకుపోయి తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీ‌సీ) వద్ద ఫిర్యాదు చేశారని పలు వెబ్‌సైట్స్ కథనాలు రాశాయి. కోలీవుడ్ నిర్మాతలు ఆమెపై నిషేధం విధించారని, ఇకపై ఆమెను సినిమాల్లోకి తీసుకోబోరని వదంతులు షికార్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించింది.

Ileana.jpg

ఆ కథనాలన్ని అబద్ధం అని చెప్పింది. ఆమెపై ఎటువంటి నిషేధం విధించలేదని పేర్కొంది. ఇలియానా తమిళ్‌లో ‘నన్బన్’ (Nanban) లో చివరగా నటించింది. ఈ సినిమాలో విజయ్‌ హీరోగా నటించాడు. తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ (Amar Akbar Anthony) లో చివరి సారిగా కనిపించింది. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. అనంతరం ఏ సౌత్ సినిమా కూడా ఆమె చేయలేదు. అందువల్ల ఆమెపై నిషేధం ఉందని అందరు అనుకుంటన్నారు. తాజాగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చెప్పిన మాటతో వదంతులన్నింటికి చెక్ పెట్టినట్లైంది.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-10T15:59:55+05:30 IST