Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

ABN , First Publish Date - 2023-03-05T15:49:47+05:30 IST

చిన్న తనంలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి (Krithi Shetty). తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppena) తోనే బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘ఉప్పెన’ ఇచ్చిన జోష్‌తో వరుసగా సినిమాలను పట్టాలెక్కించింది.

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

చిన్న తనంలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి (Krithi Shetty). తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppena) తోనే బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘ఉప్పెన’ ఇచ్చిన జోష్‌తో వరుసగా సినిమాలను పట్టాలెక్కించింది. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి మూవీస్‌ని చేసింది. టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న దశలో కోలీవుడ్ నుంచి ఆమెకు భారీ అవకాశం వచ్చింది. స్టార్ హీరో సూర్య (Suriya) కు జోడీగా నటించే ఛాన్స్‌ను దక్కించుకుంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అనంతరం ఈ చిత్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ మూవీ నుంచి ఆమెను తప్పించినట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది.

Roshni-Prakash.jpg

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), రియలిస్టిక్ డైరెక్టర్ బాల (Bala) కలసి ఓ సినిమా చేయాలి. ఈ చిత్రానికి ‘వనన్‌గాన్’ (Vanangaan) అని టైటిల్ పెట్టారు. కన్యాకుమారిలో దాదాపుగా 40రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. హీరో, డైరెక్టర్‌కు మధ్య ఉన్న సృజనాత్మక విభేదాలతో ఈ మూవీ ఆగిపోయింది. తాజాగా అరుణ్ విజయ్ (Arun Vijay) తో ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. హీరోయిన్‌గా మాత్రం కృతి శెట్టి‌ని తప్పించారని సమాచారం అందుతుంది. ఆమె స్థానంలో మరొకరిని హీరోయిన్‌గా చిత్రబృందం తీసుకుందట. పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న రోష్ని ప్రకాష్ (Roshni Prakash) ను హీరోయిన్‌ పాత్రకు ఎంపిక చేసుకున్నారట. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ‘వనన్‌గాన్’ ను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది. సూర్య, జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-05T15:50:24+05:30 IST