Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

ABN , First Publish Date - 2023-03-08T16:52:43+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘రంగస్థలం’ లో సౌండ్ ఇంజినీర్ పాత్రతో పోషించారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లో నటించారు.

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘రంగస్థలం’ లో సౌండ్ ఇంజినీర్ పాత్రతో పోషించారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఆస్కార్ నామినేషన్‌ను కూడా దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ అవార్డ్ కోసం పోటీపడుతుంది. ఈ పురస్కారాలను మార్చి 13న ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చెర్రీ హాలీవుడ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు.

హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ (Tom Cruise), హీరోయిన్ కేట్ బ్లాంచెట్ (Cate Blanchett) ను కలుసుకోవాలని ఉందని మెగా పవర్ స్టార్ చెప్పారు. ‘‘ఆస్కార్‌కు సిద్ధంగా ఉన్నానో లేదో నాకు తెలియదు. కానీ, నాకు కొంచెం నెర్వస్, ఉత్సాహంగా ఉంది. నేను చాలా మంది హాలీవుడ్ హీరో, హీరోయిన్స్‌ను చూస్తూ పెరిగాను. అందువల్ల వారి పేర్లను చెప్పలేను. కానీ, టామ్ క్రూజ్, కేట్ బ్లాంచెట్‌లను ఆస్కార్స్‌లో చూడాలని నాకు ఉంది. ఈ మధ్య టామ్ క్రూజ్‌ను ‘టాప్‌గన్ మావెరిక్’ లో చూశాను. ఆయన అద్భుతంగా నటించారు. హాలీవుడ్ సినిమాల మాదిరిగానే అనేక ఇంటర్నేషనల్ చిత్రాలు ఇక్కడ మంచి విజయం సాధిస్తున్నాయి. అంతర్జాతీయ సినిమాలను ఆదరించడంలో హాలీవుడ్‌కు విశాలమైన హృదయం ఉంది. లాస్ ఏంజెలెస్‌లోని దర్శకులు ఇండియాలోని నటులతో పనిచేస్తే బాగుంటుంది. హాలీవుడ్ చిత్రం చేయాలని నాకు ఉంది. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్‌తో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది’’ అని రామ్ చరణ్ తెలిపారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-08T19:09:16+05:30 IST