NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

ABN , First Publish Date - 2023-03-18T12:19:04+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) ఫ్యాన్స్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చారు. యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) ప్రీ రిలీజ్ వేడుకకు

NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్
Young Tiger NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) ఫ్యాన్స్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చారు. యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) ప్రీ రిలీజ్ వేడుకకు (Pre Release Event) ముఖ్య అతిథిగా వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా.. తన సినిమా వివరాల గురించి అడిగిన ఫ్యాన్స్‌కు స్వీట్ అండ్ మాస్ వార్నింగ్ (Sweet and Mass Warning) ఇచ్చారు. ఇలా చేస్తే నేను సినిమాలు మానేస్తానంటూ.. ఎన్టీఆర్ (NTR) చెప్పడంతో ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయారు. వివరాలలోకి వెళితే..

‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా తర్వాత రామ్ చరణ్ (Ram Charan) వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా ఉన్నారు. మరో వైపు శంకర్‌తో చేస్తున్న ‘RC15’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే బుచ్చిబాబు (Buchibabu) సినిమాకు సంబంధించి స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj), నర్తన్ (Narthan), సుకుమార్ (Sukumar) వంటివారితో చరణ్ తదుపరి సినిమాలు ప్లాన్ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. కానీ, ఎన్టీఆర్ విషయానికి వస్తే.. కొరటాల శివ (Koratala Siva)తో ప్రకటించిన ‘NTR30’ చిత్రం మీనమేషాలు లెక్కపెడుతోంది. ఏదో ఒక కారణంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. దీంతో అభిమానులు.. ‘NTR30’ అప్‌డేట్ కోసం సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. కొందరైతే.. సినిమా నిర్మాణ సంస్థ పేరుతో అకౌంట్స్ క్రియేట్ చేసి.. వారే అప్‌డేట్ ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లుగా అధికారిక సమాచారం బయటికి వచ్చింది. అయినా కూడా ‘NTR30’ అప్‌డేట్ అంటూ ‘దాస్ కా ధమ్కీ’ ఫంక్షన్‌లో ఫ్యాన్స్ అరుస్తుంటే.. అలాంటి వారందరికీ ఎన్టీఆర్ చిన్నగా చురక అంటించారు.

NTR.jpg

ఈ స్టేజ్‌పై తారక్ (Tarak) మాట్లాడుతూ.. ‘‘ఏంటబ్బాయ్.. నెక్స్ట్ సినిమానా.. నేనేమీ చేయడం లేదు. ఎన్నిసార్లు చెబుతారు. మొన్ననే చెప్పారు కదా. (నవ్వుతూ) త్వరలోనే మొదలవుతుంది.. అప్పటి వరకు ఆగండి. మీరలా చేస్తుంటే నెక్స్ట్ సినిమా చేయడం లేదని చెప్పేస్తా.. ఆపేస్తాను కూడా. మీరు ఆపమన్నా నేను ఆపలేను. నేను ఆపినా మీరు ఊరుకోరు. త్వరలోనే ఆ సినిమా (NTR next Film) వివరాలు రాబోతున్నాయి. అది ఇంకో రోజు, ఇంకో వేదికపై మాట్లాడుకుందాం. ఇది విశ్వక్ సినిమా ఫంక్షన్. ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం. ‘దాస్ కా ధమ్కీ’ చిత్రయూనిట్‌కు ఆశీర్వదాలు తెలియజేద్దాం’’ అంటూ సరదాగా ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Young Tiger NTR: విశ్వక్ సేన్ దర్శకత్వం మానేయాలని కోరుకుంటున్నా..

*Jr NTR: ఆస్కార్ క్రెడిట్ ఎవరిదంటే.. ఎన్టీఆర్ స్పీచ్ వైరల్

*Bigg Boss Himaja: ఘోరంగా ఏడ్చాను.. కానీ?

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-18T12:19:09+05:30 IST