RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

ABN , First Publish Date - 2023-03-15T15:27:34+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. అకాడమీ పురస్కారాల్లో కొంత మంది డ్యాన్సర్స్ ఈ పాటకు స్టెప్పులేశారు.

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. అకాడమీ పురస్కారాల్లో కొంత మంది డ్యాన్సర్స్ ఈ పాటకు స్టెప్పులేశారు. అయితే, ఒరిజినల్‌గా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) ఈ సాంగ్‌కు ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయాలి. కానీ, పలు కారణాల వల్ల హీరోలు డ్యాన్స్ చేయలేదు.

న్యూ ఢిల్లీలో పుట్టి కెనడాలో పెరిగిన నిర్మాత రాజ్ కపూర్ (Raj Kapoor). గత కొన్నేళ్లుగా అకాడమీతో కలసి పనిచేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ కు లైవ్ ప్రదర్శన ఇచ్చిన బృందంతో కలసి ఆయన పనిచేశారు. రాజ్ కపూర్ తాజాగా మీడియాతో మాట్లాడారు. హీరోలు డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వకపోవడాన్ని గల కారణాన్ని చెప్పారు. ‘‘సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాటను ఆలపిస్తున్నప్పుడు హీరోలు ప్రదర్శన ఇవ్వాలి. ఫిబ్రవరి చివరలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్స్‌‌కు హాజరు అవుతున్నారని మాకు సమాచారం అందింది. కానీ, స్టేజ్‌పై లైవ్‌ ప్రదర్శన ఇవ్వడం వారికి ఇబ్బందిగా అనిపించింది. ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో రిహార్సల్స్‌కు సమయం లేదని వారు భావించారు. ‘నాటు నాటు’ పాటను రెండు నెలల పాటు రిహార్సల్స్ చేశారు. 15రోజులకు పైగా షూట్ చేశారు. కానీ, ఆస్కార్స్‌లో ప్రదర్శన ఇచ్చే ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ మాత్రం 18గంటల పాటు రిహార్సల్స్ చేశారు’’ అని రాజ్ కపూర్ తెలిపారు.

ఆస్కార్స్‌‌కు రాజమౌళి, రమా రాజమౌళి, రామ్ చరణ్, ఉపాసన, జూనియర్ ఎన్టీఆర్, ఎమ్‌ఎమ్. కీరవాణి, శ్రీ వల్లీ, చంద్రబోస్, కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్, ఎస్‌ఎస్. కార్తికేయ తదితరులు హాజరయ్యారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ‘నాటు నాటు’ ను ఆస్కార్ స్టేజ్‌పై పాడారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-15T15:27:37+05:30 IST