Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

ABN , First Publish Date - 2023-03-09T16:38:54+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాందించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘రంగస్థలం’ లో సౌండ్ ఇంజినీర్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు.

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాందించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘రంగస్థలం’ లో సౌండ్ ఇంజినీర్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు. చివరగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లో నటించారు. ఈ చిత్రంతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఆర్‌సీ15’ (RC15) అని వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 60శాతానికి పూర్తయింది. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ సినిమా పేరును ప్రకటించనున్నారు. అందుకోసం నిర్మాతలు చిత్రం కోసం పలు పేర్లను రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలుస్తోంది.

టాప్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘ఆర్‌సీ15’ (RC15)ని నిర్మిస్తున్నారు. అందుకోసం ఆయన ‘సేనాని’ (Senani), ‘సేనాపతి’, ‘సీ.ఈ.వో’ (CEO), ‘సైనికుడు’ అనే టైటిల్స్‌ను రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ‘ఆర్‌సీ15’ టీంలోని ఎక్కువ మంది ‘సేనాని’ పేరు వైపు మొగ్గు చూపారట. కానీ, శంకర్ మాత్రం ‘సైనికుడు’ అనే టైటిల్ బాగుంటుందని భావిస్తున్నారట. ఈ రెండు టైటిల్స్‌లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. శంకర్, చరణ్ సినిమా పాన్ ఇండియాగా రూపొందుతుంది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని భాషలకు ఒకే టైటిల్ పెట్టాలని చిత్ర బృందం భావిస్తుంది. అందువల్ల టీంలోని కొంతమంది మాత్రం ‘సీ.ఈ.వో’ టైటిల్ అయితే అన్ని భాషలకు బాగుంటుందని సూచించారట. అయితే, మేకర్స్ ఏ టైటిల్‌ను ఫిక్స్ చేశారో తెలియాలంటే చరణ్ పుట్టిన రోజు వరకు వేచి చూడాల్సిందే.

‘ఆర్‌సీ15’ లో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా చేస్తున్నారు. అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ లేదా జనవరికి విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-09T16:42:54+05:30 IST