Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

ABN , First Publish Date - 2023-03-18T16:16:06+05:30 IST

మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’, ‘అల వైకుంఠపురంలో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’, ‘అల వైకుంఠపురంలో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారని బన్నీకి పేరుంది. ఫంక్షన్స్ జరిగిన ప్రతిసారి వారికి సెల్ఫీలు, ఫొటోలు కూడా ఇస్తుంటారు. ఫ్యాన్స్‌పై ఇంత అభిమానాన్ని చూపించే బన్నీ తన సహ నటిపై మాత్రం దానిని చూపించలేకపోయారు. తనతో కలసి సినిమా చేసిన హీరోయిన్‌ను సోషల్ మీడియాలో అల్లు అర్జున్ బ్లాక్ చేయడం ఇందుకు కారణం.

Bhanu-Sri-Mehra.jpg

గుణ శేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన సినిమా ‘వరుడు’ (Varudu). భాను శ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) హీరోయిన్‌గా నటించారు. ఆర్య (Arya) కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. ఈ మూవీ హీరోయిన్‌ను బన్నీ సోషల్ మీడియాలో బ్లాక్ చేశారు. భాను శ్రీ మెహ్రా ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌లో చెప్పారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఫన్నీగా పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘చట్రంలో బంధీ అయినట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా.. అల్లు అర్జున్‌తో ‘వరుడు’ సినిమా చేశాను. అయినప్పటికి, ఎటువంటి పని లభించనప్పుడు నాకు అనిపించింది. కానీ, జీవితంలోని ప్రతి అడ్డంకిలోను నేను హాస్యాన్ని వెతుక్కోవడం నేర్చుకున్నాను. ప్రత్యేకంగా ఇటువంటి సమయాల్లోనే.. ట్విటర్‌లో అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేసినప్పుడు’’ అని భాను శ్రీ మెహ్రా పేర్కొన్నారు. ఏమైందో తెలియదు కానీ భాను శ్రీ పోస్ట్ పెట్టిన కాసేపటికే బన్నీ ఆమెను అన్‌బ్లాక్ చేశారు. ‘‘అల్లు అర్జున్ నన్ను అన్‌బ్లాక్ చేశారు. నేను కెరీర్ లో ఎదుర్కొన్న ఇబ్బందులకు బన్నీపై నిందను మోపలేను. నాపై దయ చూపించినందుకు థ్యాంక్స్ అల్లు అర్జున్’’ అని భాను శ్రీ పోస్ట్ పెట్టారు. భాను శ్రీ మెహ్రా ‘వరుడు’ సినిమాతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రమే స్టార్ హీరోతో చేసినప్పటికి ఆమెకు అవకాశాలు అంతగా రాలేదు. అనంతరం చిన్న, చితక పాత్రలు చేసినప్పటికి ఆమె కెరీర్‌లో నిలదొక్కుకోలేకపోయారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Updated Date - 2023-03-18T16:19:23+05:30 IST