Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌తో సినిమా చేస్తున్నారా.. స్పందించిన హీరో..

ABN , First Publish Date - 2023-03-08T15:30:56+05:30 IST

టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. తన నటన, వాక్చాతుర్యంతో అభిమానులను అలరిస్తున్నారు. ‘అదుర్స్’, ‘జై లవకుశ’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొన్నాళ్లుగా తారక్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌తో సినిమా చేస్తున్నారా.. స్పందించిన హీరో..

టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. తన నటన, వాక్చాతుర్యంతో అభిమానులను అలరిస్తున్నారు. ‘అదుర్స్’, ‘జై లవకుశ’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొన్నాళ్లుగా తారక్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాప్ కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వంలో ఆయన నటించనున్నారని రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఈ వదంతులు విపరీతంగా షికార్లు కొడుతుండంతో తారక్ స్పందించారు.

వెట్రిమారన్ ఓ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సంప్రదించారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు రెండు భాగాలుగా రూపొందబోతుందని కథనాలు వెలువడ్డాయి. ఒక్క భాగంలో ధనుష్ (Dhanush), మరో భాగంలో తారక్ నటిస్తారని రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఫలితంగా తారక్ ఓ స్టేట్‌మెంట్‌ను రిలీజ్ చేశారు. ‘‘గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్, ధనుష్, వెట్రిమారన్ సినిమాకు సంబంధించిన వార్తలు విపరీతంగా షికార్లు కొడుతున్నాయి. ఆ వార్తలన్ని అబద్ధం. దయచేసి అటువంటి రూమర్స్‌ను పట్టించుకోకండి’’ అని జూనియర్ ఎన్టీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ చివరగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లో నటించారు. ఈ చిత్రం అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను గెలుచుకుంది. ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ అవార్డు కోసం పోటీపడుతుంది. ఈ పురస్కారాలను మార్చి 13న ప్రదానం చేయనున్నారు. అందులో భాగంగా తారక్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌ను లాస్‌ఏంజెల్స్‌లో చేస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-08T15:33:21+05:30 IST