సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hyper Aadi: రికార్డులు అనేవి పుట్టిందే ఆయనను చూసి.. హైపర్ ఆది స్పీచ్ వైరల్

ABN, First Publish Date - 2023-03-27T22:00:16+05:30

ఒక మనిషిని చూడగానే పది మంది దండం పెడితే అది మెగాస్టార్ (Megastar).. ఒక మనిషి పది మందికి అన్నం పెడితే అది పవర్ స్టార్.. చిరంజీవిలా భుజం తట్టి ఎంకరేజ్‌ చేయడం తెలుసు.. బాబాయ్ పవన్ కళ్యాణ్‌లా..

Comedian Hyper Aadi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక మనిషిని చూడగానే పది మంది దండం పెడితే అది మెగాస్టార్ (Megastar).. ఒక మనిషి పది మందికి అన్నం పెడితే అది పవర్ స్టార్.. చిరంజీవిలా భుజం తట్టి ఎంకరేజ్‌ చేయడం తెలుసు.. బాబాయ్ పవన్ కళ్యాణ్‌లా అందరికీ భోజనం పెట్టి, హెల్ప్ చేయడం తెలుసు.. దటీజ్ మెగా పవర్ స్టార్ (Mega Power Star) అని అన్నారు కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi). తండ్రికి తగ్గ తనయుడుగా, బాబాయ్ పేరుని నిలబెట్టిన అబ్బాయిగా.. గ్లోబర్ స్టార్ (Global Star) ఇమేజ్‌ని సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan) పుట్టిన రోజు(మార్చి 12) వేడుకలను ఆదివారం మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ శిల్పా కళా వేదికలో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి ప్రముఖులెందరో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది మాట్లాడుతూ.. (Ram Charan Birthday Celebrations)

‘‘ఒక మనిషిని చూడగానే పది మంది దండం పెడితే అది మెగాస్టార్ (Megastar).. ఒక మనిషి పది మందికి అన్నం పెడితే అది పవర్ స్టార్ (Power Star).. చిరంజీవి (Chiranjeevi)లా భుజం తట్టి ఎంకరేజ్‌ చేయడం తెలుసు.. బాబాయ్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)లా అందరికీ భోజనం పెట్టి, హెల్ప్ చేయడం తెలుసు.. దటీజ్ మెగా పవర్ స్టార్. తరాలు మారొచ్చు.. కొత్త హీరోలు రావొచ్చు.. రికార్డులు క్రియేట్ చేయవచ్చు.. కానీ రికార్డులు అనేది పుట్టిందే చిరంజీవిని చూసి.. ఒకసారి నెంబర్ వన్ (Number 1 Hero) అయితే.. ఎప్పటికీ నెంబర్ వన్ అని చిరంజీవిగారు నిరూపించారు. ఆయన గురించి ప్రతీ ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడతారు. పొన్నాంబలం ఆరోగ్యం బాగా లేకపోతే నలభై లక్షలు పెట్టి వైద్యం చేయించారు. పవన్ కళ్యాణ్‌.. జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు.. లెక్కలేనంత జనాభాకు ఒకే ఒక్కడు.. నోటుకు ప్రమేయం లేని ఓటును, పదవికి ప్రలోభం కానీ రాజకీయాన్ని నడుపుతున్న, నడుస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్‌. ఒకప్పుడు ఆంధ్రలో ఇంత వచ్చింది.. తెలంగాణలో ఇంత వచ్చింది అని చెప్పుకునే మనల్ని, అమెరికాలో (USA) ఎంత వచ్చింది అని కనుక్కునేలా చేసిన స్టార్ మెగా పవర్ స్టార్. తండ్రి పేరు నిలబెడతాడా? బాబాయ్ పేరు కాపాడతాడా? అన్న వారికి.. నేను కుటుంబానికి పేరు తీసుకురావడానికి పుట్టిన వాడ్ని కాదు.. దేశానికి పేరు తేవడానికి పుట్టిన వాడ్ని అని నిరూపించారు రామ్ చరణ్‌ (Ram Charan). మెగా పవర్ స్టార్ అంటే లోకల్ కాదు.. గ్లోబల్’’ అని అన్నారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమంలో హైపర్ ఆది మాట్లాడిన మాటలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెగాభిమానులు ఆయన స్పీచ్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్‌ల గురించి నీకంటే గొప్పగా ఇంకెవరు చెప్పలేరన్నా.. అంటూ మెగాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మెహర్ రమేష్‌, బాబీ, బుచ్చిబాబు సానా, దిల్ రాజు, మైత్రీ నిర్మాత నవీన్, సాయి ధరమ్ తేజ్, ప్రేమ్ రక్షిత్, మెగా బ్రదర్ నాగబాబు వంటి వారు రామ్ చరణ్ గురించి చెప్పుకొచ్చారు. (Global Star Ram Charan Birthday Celebrations)

ఇవి కూడా చదవండి:

*********************************

*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక

*Jr NTR: చరణ్‌కు తారక్ బర్త్‌డే విష్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

*Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!

*Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-27T22:00:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!