Jr NTR: చరణ్‌కు తారక్ బర్త్‌డే విష్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

ABN , First Publish Date - 2023-03-27T19:31:30+05:30 IST

రామ్ చరణ్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే..

Jr NTR: చరణ్‌కు తారక్ బర్త్‌డే విష్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
Jr NTR and Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పుట్టినరోజును పురస్కరించుకుని గ్లోబల్‌గా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న రామ్ చరణ్‌కు సోషల్ మీడియా వేదికగా అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి చరణ్‌కు శుభాకాంక్షలు అందుతున్నాయి. దీంతో రామ్ చరణ్ పేరు, ఆయన చేస్తున్న సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. అయితే చరణ్‌కు.. ఎవరు, ఎన్ని రకాలుగా విష్ చేసినా.. ఒకే ఒక్క వ్యక్తి చేసిన విష్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR).

రామ్ చరణ్ (Ram Charan), తారక్ (Tarak) కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరితో సినిమా అంటే కత్తిమీద సాము వంటిది. కానీ దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్ కావడంతో.. ఆ సినిమా ఎటువంటి విభేదాలు లేకుండా, రాకుండా.. విజయవంతంగా రూపుదిద్దుకుంది. ఈ రోజు ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటుతూ ఆస్కార్ అవార్డును (Oscar Award) కొల్లగొట్టింది. ఈ సినిమా విడుదల సమయంలో జరిగిన ప్రమోషన్స్‌లో చరణ్, తారక్ మధ్య ఎటువంటి బాండింగ్ ఉంటుందనేది వారిరువు క్లారిటీ ఇచ్చారు. ఇద్దరి మధ్యా సోదర బంధం ఉంటుందని.. అది ఇప్పటిది కాదని, పుట్టినరోజు వస్తే.. ఇంట్లో వాళ్ల కళ్లు గప్పి.. ఇద్దరం బయటికి చెక్కేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరి అభిమానుల మధ్య వైరం కాస్త తగ్గుముఖం పట్టింది.

ఇద్దరూ.. వ్యక్తిగతంగా సోదరులం (Brothers).. కానీ సినిమాల విషయానికి వస్తే మాత్రం ఇద్దరి మధ్యా పోటాపోటీ ఉంటుందని కూడా సెలవిచ్చారు. అది కూడా హెల్దీగా ఉంటుందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‌లో కూడా ఇద్దరూ ఇదే విషయం చెప్పారు. ఇక చరణ్ పుట్టినరోజు (HBDMegaPowerStar) సందర్భంగా తారక్.. విష్ చేస్తాడా? లేదా? అంటూ అంతా సోమవారం ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు. మాములుగా అయితే తారక్ విష్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వారి సెలబ్రేషన్స్ అందరికంటే ముందే మొదలవుతాయని ఇప్పటికే చెప్పి ఉన్నారు. అయినా కూడా తారక్ ట్విట్టర్ వేదికగా చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపి.. తన గొప్పమనసు చాటుకున్నారు. ‘నా సోదరుడు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీకంతా మంచే జరగాలి’ అంటూ చరణ్‌కు తారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో మెగా, నందమూరి అభిమానులు (Mega and Nandamuri Fans) సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘మేము మేము ఎంత తిట్టుకున్నా.. మీ ఇద్దరి స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అన్నా.. థ్యాంక్యూ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్‌ను విష్ చేస్తూ తారక్ చేసిన ట్వీట్ (Jr NTR) వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!

*Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-27T19:31:33+05:30 IST