Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

ABN , First Publish Date - 2023-03-20T18:39:33+05:30 IST

కొన్ని రోజులుగా ‘దసరా’ (Dasara) మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ (Chamkeela Angeelesi) సాంగ్‌పై ఎటువంటి చర్చలు నడుస్తున్నాయో తెలియంది కాదు. ఈ పాట శ్రోతల్ని బాగా ఆకర్షిస్తోంది. ‘దసరా’ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు

Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?
Keerthi Suresh and Singer Dhee

కొన్ని రోజులుగా ‘దసరా’ (Dasara) మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ (Chamkeela Angeelesi) సాంగ్‌పై ఎటువంటి చర్చలు నడుస్తున్నాయో తెలియంది కాదు. ఈ పాట శ్రోతల్ని బాగా ఆకర్షిస్తోంది. ‘దసరా’ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలేవీ తీసుకురాలేని క్రేజ్‌ని.. సినిమాపై ఈ పాట తీసుకొస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అందుకు కారణం ఈ పాటలోని ఫిమేల్ వాయిస్. ఈ పాటని రామ్ మిరియాల (Ram Miriyala)తో కలిసి దీక్షిత అలియాస్ ధీ (Dhee) పాడింది. రామ్ మిరియాల వాయిస్ పరంగా తెలుగు వారికి బాగా పరిచయమే. ఆయన వాయిస్‌లో తెలంగాణ యాసలో చాలా పాటలు వచ్చాయి. కానీ తమిళ సింగర్ అయిన ధీ.. తెలంగాణ యాసలో ఈ పాటని పాడిన విధానం, ఆమె హస్కీ వాయిస్ ఇప్పుడందరినీ హంట్ చేస్తోంది. దీంతో ఈ ‘ధీ’ ఎవరు? అంటూ.. అంతా ఇంటర్నెట్‌లో సెర్చింగ్ మొదలెట్టారు.

ఈ సెర్చింగ్‌లో ఆమె గురించి చాలా విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ ‘ధీ’ ఎవరో కాదు. ‘దసరా’ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) కుమార్తె. అంతేకాదు, ఈమె వాయిస్‌లో ఇప్పటికే చాలా పాటలు వచ్చాయి. మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ నాటే కాకుండా మ్యూజిక్ ప్రపంచం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసిన ‘రౌడీ బేబీ’ (Rowdy Baby) సాంగ్‌లో ఫీమేల్ వాయిస్ ఈ ‘ధీ’దే. ‘గురు’ (Guru) సినిమాలోని ‘ఓ సక్కనోడా’ పాట, ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో ‘కాటుక కనులే’ పాట పాడింది కూడా ఈ సింగరే. ఇదే కాదు.. అరివు, ధీ, సంతోష్ నారాయణన్ కలిసి చేసిన ‘ఎంజాయ్ ఎంజామీ’ (Enjoy Enjaami) వీడియో సాంగ్ అయితే ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. అప్పట్లో ఈ సాంగ్‌పై పెద్ద కాంట్రవర్సీనే (Controversy) నడిచింది. ఈ పాటను ఇప్పటి వరకు 45 కోట్ల మంది వీక్షించారంటే.. ‘ధీ’ (Singer Dhee) వాయిస్‌కి ఉన్న పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Keerthi.jpg

14 సంవత్సరాల వయస్సు నుంచే ‘ధీ’ పాటలు పాడటం ప్రారంభించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ (AR Rahman)తో తన మొదటి పాప్ ఆల్బమ్‌ను ఈ గాయని రూపొందించింది. ఆ ఆల్బమ్ తర్వాత తన తండ్రి సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన ఎన్నో పాటలను ఆమె పాడింది. ఆమె చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా మంచి ఆదరణను దక్కించుకున్నాయి. అయితే ఆమెకు మాత్రం ఇప్పటి వరకు సరైన గుర్తింపు రాలేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు ‘దసరా’లో ఆమె పాడిన ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సినిమాకు క్రేజ్ తీసుకురావడమే కాకుండా.. ఆమె గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తుంది. ఆఖరికి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ‘రౌడీ బేబీ’ కూడా ‘ధీ’ గురించి ప్రపంచానికి తెలియనీయలేదు. కానీ ‘దసరా’లోని పాటతో.. ‘ధీ’ ఇంతకు ముందు పాడిన పాటలన్నింటినీ వెతికి మరీ వింటున్నారు. ఆమె వాయిస్ అలా ఉంది మరి.

Nani.jpg

ఇక ‘దసరా’ సినిమాలో ఆమె పాడిన ‘ఛమ్కీల అంగీలేసి’ (Dasara Chamkeela Angeelesi) పాట అంత సామాన్యమైన, సాధారణమైన పాటేం కాదు. కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) రాసిన ఈ పాటలోని టఫ్ పదాలను తెలంగాణ యాసలో ఒక తమిళ సింగర్ పలకడం చాలా కష్టంతో నిండినది. కానీ ధీ అలవోకగా పాడేసింది. ఆ విషయం లిరికల్ వీడియోలో స్పష్టంగా తెలిసిపోతుంది. అందుకే ఒక తమిళ సింగర్.. తెలంగాణ యాసలో అద్భుతంగా పాడిందంటూ.. ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి (Praises on Singer Dhee). అంతేనా.. ఇప్పుడామెతో పాటలు పాడించేందుకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ సైతం చూస్తున్నారంటే.. ఆమె వాయిస్ శ్రోతలను ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే.. సింగర్ సిధ్ శ్రీరామ్‌ (Sid Sriram)లా.. తెలుగు ఇండస్ట్రీలో ‘ధీ’ కూడా ఓ మెరుపు మెరిపించడం ఖాయం అనేలా ఇండస్ట్రీలో అప్పుడే టాక్ కూడా మొదలైంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్

* Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-20T18:39:35+05:30 IST