Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-03-27T17:58:13+05:30 IST

మొదటి రోజు, మొదటి ఆట నుంచే సినిమాకు ‘కబ్జ’ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. ‘విక్రాంత్ రోణ’ (Vikranth Rona) తరహాలో విడుదలైన రెండు మూడు రోజుల తర్వాత అయినా పికప్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ..

Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?
Kabzaa OTT Release Date

కన్నడ సినీ ఇండస్ట్రీ (Kannada Cine Industry) స్టామినాని దేశ వ్యాప్తంగా చాటిచెప్పిన చిత్రం ‘కెజియఫ్’ (KGF). అదే సినిమా తరహాలో తెరకెక్కి.. రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన సినిమా ‘కబ్జ’ (Kabzaa). టీజర్, ట్రైలర్‌తో ‘కెజియఫ్’ తరహా మూవీ అనేలా క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం.. మార్చి 17న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలైంది. కానీ.. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. మొదటి రోజు, మొదటి ఆట నుంచే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ‘విక్రాంత్ రోణ’ (Vikranth Rona) తరహాలో విడుదలైన రెండు మూడు రోజుల తర్వాత అయినా పికప్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ.. ఏ దశలోనూ అది జరగలేదు. టాక్ బాగా వీక్‌గా ఉండటంతో పాటు.. కంటెంట్ పరంగా కూడా నెగిటివ్ కామెంట్స్ వినిపించడంతో.. ఈ సినిమాని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రస్ట్ పెట్టలేదు. అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా మంచి ఆదరణ పొందుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ చిత్ర ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇదే.

ఉపేంద్ర (Upendra), సుదీప్ (Sudeepa), శ్రియ (Shriya) వంటి తారాగణంతో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 14న అమెజాన్ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. విజువల్‌గా గ్రాండ్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ఓటీటీ వీక్షకులను అలరించే అవకాశం ఉంది కానీ.. అది ఎంత వరకు అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ‘కబ్జ’ సినిమా ఎండింగ్‌లో సీక్వెల్ కూడా ఉన్నట్లుగా ప్రకటించారు. మరి మొదటి పార్ట్ ఆశించినంత విజయం సాధించలేదు కాబట్టి.. పార్ట్ 2 ఉంటుందా? ఉండదా? అనేది కూడా క్లారిటీ లేదు. అది కూడా ఓటీటీ (OTT)‌లో ప్రేక్షకులు ఈ సినిమా ఆదరించిన దానిపైనే ఆధారపడి ఉంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తే మాత్రం ఖచ్చితంగా.. మేకర్స్ పార్ట్ 2ని ప్లాన్ చేస్తారు.. లేదంటే కష్టమే అని చెప్పుకోవచ్చు. (Kabzaa Part 2)

‘కబ్జ’ కథ (Kabzaa Story) విషయానికి వస్తే.. పీరియడ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. స్వాతంత్ర్యం రాకముందు మొదలై.. వచ్చాక అంటే 1975 మధ్యలో జరిగిన కథ ఇది. ఆర్కేశ్వర (ఉపేంద్ర) పైలట్. అతని తండ్రి స్వాతంత్ర్య ఉద్యమంలో మరణిస్తారు. తల్లి (సుధ), అన్నయ్యలు ఆర్కేశ్వరను పెంచి పెద్ద చేస్తారు. వారంటే అతనికి ఎంతో ఇష్టం. అలాగే అతని ప్రియురాలు యువరాణి మధుమతి (శ్రియ). అయితే పైలట్‌గా జాయిన్ అయ్యే ముందు 15 రోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చిన ఆర్కేశ్వరుడుకి.. అదే సమయంలో జరిగిన ఓ సంఘటనతో కుటుంబం అంతా చెల్లాచెదురు అయిపోతుంది. దీని వెనుక పెద్ద మాఫియా ఉందని తెలుసుకున్న ఆర్కేశ్వరుడు ఏం చేశాడు? మాఫియా‌కు అతను ఎందుకు ఎదురుతిరిగాడు? చివరికి యువరాణిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘కబ్జ’ కథ. (Kabzaa OTT Release Date)

ఇవి కూడా చదవండి:

*********************************

*Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!

*Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-27T17:58:14+05:30 IST