Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

ABN , First Publish Date - 2023-03-23T17:39:31+05:30 IST

మాస్ మహరాజ్ రవితేజ (Mass Maharaj Ravi Teja) తనదైన నటనతో.. తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఆయన వారసుడు మహాధన్ (Mahadhan) కూడా ఆ మధ్య ‘రాజా ది గ్రేట్’ (Raja The Great) చిత్రంలో

Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?
Ravi Teja Brother Raghu Son Madhav Movie Opening

మాస్ మహరాజ్ రవితేజ (Mass Maharaj Ravi Teja) తనదైన నటనతో.. తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఆయన వారసుడు మహాధన్ (Mahadhan) కూడా ఆ మధ్య ‘రాజా ది గ్రేట్’ (Raja The Great) చిత్రంలో కనిపించారు. ఇప్పుడు రవితేజ తమ్ముడు రఘు (Ravi Teja brother Raghu) కొడుకు మాధవ్ (Madhav) హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (JJR Entertainments) పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఈ చిత్రం రూపొందబోతోంది. ‘పెళ్లి సందD’ చిత్రంతో కమర్షియల్‌గా మంచి హిట్ అందుకున్న దర్శకురాలు ‘గౌరీ రోణంకి’ (PellisandaD fame director Gouri Ronanki) డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్‌లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao), నిర్మాత డి. సురేష్ బాబు (D Suresh Babu), నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (Bekkem Venugopal), దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు (Chadalavada Srinivasarao), నటుడు రఘు (Raghu) తదితరుల ఆశీస్సులతో పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రారంభమైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్‌ను అందజేయగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో..

Madhav-2.jpg

నిర్మాత జేజేఆర్ రవిచంద్ (JJR Ravichand) మాట్లాడుతూ.. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీలో ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ప్రారంభోత్సవం జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. పెళ్లి సందD మూవీతోనే ప్రూవ్ చేసుకున్న దర్శకురాలు గౌరి రోణంకి (Gouri Ronanki) రెండో చిత్రాన్ని మా బ్యానర్‌లో చేయడం.. రవితేజగారి సోదరుడు రఘుగారి అబ్బాయి మాధవ్‌ను హీరోగా పరిచయం చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా గౌరిగారి పెళ్లి సందడి ఫ్లేవర్‌లో కాకుండా పూర్తి భిన్నంగా ఉంటుంది. మంచి పాయింట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఆమె ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి.. తన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ‌గారు షూటింగ్‌లో బిజీగా ఉండి.. ఈ ఓపెనింగ్‌కు రాలేకపోయారు. మంచి ఫ్యామిలీ నుంచి వస్తోన్న మాధవ్ గారు ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను. గతంలో సాంబశివ క్రియేషన్స్ బ్యానర్‌లో ఐదు చిత్రాలు చేశాను. జేజేఆర్ బ్యానర్‌లో మొదటి సినిమా నవీన్ చంద్రతో చేశాను. ఇది రెండో సినిమా. ఈ చిత్రంలో అన్ని క్రాఫ్ట్స్ హైలెట్ కాబోతున్నాయి. టెక్నీషియన్స్ అందరూ ఇప్పటికే పెద్ద సినిమాలు చేసి నిరూపించుకుని ఉన్నారు. మొదటి నుంచి నాకు సపోర్ట్‌గా ఉన్న చదలవాడ శ్రీనివాసరావుగారికి థ్యాంక్యూ.. అని చెప్పుకొచ్చారు.

Madhav-3.jpg

దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ .. నా తల్లిదండ్రులకు, మా గురువుగారు కె.రాఘవేంద్రరావు గారికి ధన్యవాదాలు. ఓ రకంగా ఇది నా సెకండ్ డెబ్యూ మూవీగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మమ్మల్ని దీవించడానికి వచ్చిన మా గురువుగారు, సురేష్ బాబుగారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను.. మా హీరో మాధవ్‌ (Ravi Teja Brother Son)ను నమ్మినందుకు నిర్మాత రవిచంద్‌గారికి థ్యాంక్స్. వారు చెప్పినట్టుగా ఇది చాలా యూత్ ఫుల్‌గా సాగుతూ.. కలర్ ఫుల్‌గా ఉండే సినిమా. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. ఆయన ఈ కథ విని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇక నా గత చిత్రం లాగానే మీడియా సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

Madhav-1.jpg

హీరో మాధవ్ (Madhav) మాట్లాడుతూ.. అందరికీ ధన్యవాదాలు. ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ప్రేక్షకులు, మీడియా, ఇండస్ట్రీ వారందరి సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటున్నాను. మా టీమ్‌ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Kantara 2: కీలక అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-23T17:39:34+05:30 IST