Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!

ABN , First Publish Date - 2023-03-25T16:16:12+05:30 IST

మంచు మనోజ్ (Manchu Manoj) రెండో పెళ్లి తర్వాత మంచు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా కనిపిస్తోంది. అదెలా అంటే.. తాజాగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా

Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!
Manchu Vishnu and Manchu Manoj

మంచు మనోజ్ (Manchu Manoj) రెండో పెళ్లి తర్వాత మంచు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా కనిపిస్తోంది. అదెలా అంటే.. తాజాగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని షేర్ చేసి.. మంచు విష్ణు (Manchu Vishnu) రౌడీయిజం చేస్తున్నారనేలా రాసుకొచ్చారు. అయితే వెంటనే ఆ వీడియోని డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే ఆ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ వీడియోలో సారధి (Saradhi) అనే మంచు ఫ్యామిలీ అనుచరుడిపై మంచు విష్ణు గొడవపడుతూ.. కొట్టబోతున్నాడు. అయితే, ఇప్పుడే కాదు.. ఎప్పటి నుండో మంచు ఫ్యామిలీలో (Manchu Family) విభేదాలు చెలరేగుతున్నాయనేలా వార్తలు వస్తున్నాయి. అందుకే మోహన్ బాబు (Mohan Babu) ఫిల్మ్ నగర్‌లో (Film Nagar) ఉన్న ఇంటిని వదిలేసి ప్రశాంతత కోసం శంషాబాద్‌కు వెళ్లిపోయారనేలా టాక్ నడుస్తోంది. అయితే అసలు విషయం ఏమిటనేది ఎవరికీ తెలియదు కానీ.. మంచు మనోజ్ షేర్ చేసిన వీడియోతో మాత్రం.. మంచు ఫ్యామిలీలో గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయనేది జనానికి ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడా గొడవలపై మరింత క్లారిటీ ఇచ్చేలా మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ఈసారి ఆయన డైరెక్ట్‌గా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా కొటేషన్స్‌తో కాక రేపాడు.

‘బతకండి.. బతకనివ్వండి’ అంటూ దండం పెడుతున్న ఎమోజీలను జోడించిన మనోజ్.. సుజీ కశీమ్ (Suzy Kassem), డేవిడ్ లించ్ (David Lynch) కొటేషన్స్‌ను షేర్ చేశాడు. ‘కళ్ల ముందు జరుగుతున్న తప్పును పట్టించుకోకుండా వదిలేయడం కన్నా.. ఆ తప్పును ఎదురించి న్యాయం కోసం నిలబడేందుకు చావడానికైనా సిద్ధమే’ అని ఒక కోట్.. ‘క్రియేటివిటీకి నెగిటివిటీయే శత్రువు’ అని మరో కోట్‌ ఉన్న కార్డులను మనోజ్ షేర్ చేశాడు. మనోజ్ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు కూడా ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మనోజ్ చెబుతున్న ప్రకారం.. మంచు విష్ణు తప్పు చేస్తున్నాడా? అందుకే మంచు మనోజ్ ఎదురించి.. అలా వీడియో పోస్ట్ చేశాడా? అనేలా కామెంట్స్ చేస్తున్నారు. (Manchu Manoj Tweets)

అసలీ గొడవలకు కారణం ఏమిటి? ఎందుకు మంచు ఫ్యామిలీ అనుచరుడైన సారధిని మంచు విష్ణు కొట్టబోయాడు? ఈ విషయంపై మోహన్ బాబు, మంచు లక్ష్మీ కూడా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అందరి ఇంట్లో ఉన్నట్లే మా ఫ్యామిలీలోనూ చిన్న చిన్న గొడవలు ఉంటాయని.. మంచు ఫ్యామిలీ ఎంత కవర్ చేయాలని చూసినా.. మనోజ్ షేర్ చేసిన వీడియోతో ఇంటిలో నుంచి పబ్లిక్‌లోకి ఆ గొడవలు వచ్చేశాయని.. మంచు ఫ్యామిలీ ఎందుకు గమనించడం లేదు? వంటి ప్రశ్నలను నెటిజన్లు సోషల్ మీడియా (Social Media) వేదికగా రైజ్ చేస్తున్నారు. ఇక మంచు ఫ్యామిలీని ఆరాధించే అభిమానులు మాత్రం.. పెద్దాయన మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) యాక్షన్‌లోకి దిగి.. వీలైనంత త్వరగా వీటిని పరిష్కరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*The Elephant Whisperers: వారి ఆనందానికి ఆస్కార్ అవార్డ్ ఏం సరిపోతుంది?

*Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-25T16:51:50+05:30 IST