Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?

ABN , First Publish Date - 2023-03-25T14:19:39+05:30 IST

అయితే సెన్సార్ నుంచి మాత్రం ఈ చిత్రానికి షాక్ ఎదురైనట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా.. ఈ సినిమాకు కట్స్ విధించడంతో..

Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?
Nani Dasara Movie Stills

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా నటిస్తోన్న మాసియస్ట్ పాన్ ఇండియా (Pan India) ఎంటర్‌టైనర్ ‘దసరా’ (Dasara). కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ ఒదెల (Srikanth Odela) దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యుబైఏ (U/A Certificate) సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. అయితే సెన్సార్ నుంచి మాత్రం ఈ చిత్రానికి షాక్ ఎదురైనట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా.. ఈ సినిమాకు కట్స్ విధించడంతో.. ప్రస్తుతం ఈ విషయంలో ‘దసరా’ (Dasara Movie) టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది.

ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు (Censor Team) మొత్తంగా 36 కట్స్‌తో పాటు.. కొన్ని బూతు పదాలను మ్యూట్ చేయాలని, అలాగే ధూమపానం, మద్యపానంకు సంబంధించి వచ్చే డిస్‌క్లైమర్ ఫాంట్‌ను పెద్ద సైజ్‌లో చూపించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, హింసాత్మక సన్నివేశాలను సీజీతో కవర్ చేయాలని సూచిస్తూ.. చిత్రానికి యుబైఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లుగా సమాచారం. వాస్తవానికి ఈ చిత్ర టీజర్, ట్రైలర్ చూస్తుంటేనే.. ఇది A సర్టిఫికేట్ సినిమా అని తెలుస్తుంది. హింసతో పాటు మద్యపాన మోతాదు ఎక్కువగా ఉన్నట్లుగా అర్థమైంది. కానీ యుబైఏ నిమిత్తం.. సెన్సార్ పలు కండీషన్స్ విధించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఫస్టాఫ్ 20, సెకండాఫ్‌లో 16.. మొత్తంగా 36 కట్స్‌ని (Dasara Censor Cuts) బోర్డు విధించినట్లుగా టాక్ నడుస్తోంది. (Dasara Censor Details)

Dasara-Film.jpg

తెలంగాణకు (Telangana) చెందిన సింగరేణి సమీపాన ఉండే వీర్లపల్లి గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి.. సెన్సార్ సూచించిన ఈ కట్స్ జాబితా చూసి చిత్రయూనిట్ కూడా షాక్ అయిందట. సెన్సార్ బోర్డు సూచించిన కటింగ్ సన్నివేశాలన్నీ పోగా.. చిత్ర నిడివి 2 గంటల 39 నిమిషాలకు లాక్ చేసినట్లుగా సమాచారం. అయితే సినిమాపై, నాని నటనపై మాత్రం సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది. ఊర మాస్ పాత్రలో నాని విశ్వరూపం చూడబోతున్నారనేలా సెన్సార్ నుంచి వచ్చిన టాక్‌తో నాని ఫ్యాన్స్ (Nani Fans) ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇన్ని కట్స్, మ్యూట్స్ తర్వాత.. ‘దసరా’ సినిమా ఎలా ఉండబోతోందో.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే మాత్రం.. మార్చి 30 వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ (Santosh Narayanan) సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*The Elephant Whisperers: వారి ఆనందానికి ఆస్కార్ అవార్డ్ ఏం సరిపోతుంది?

*Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-25T14:19:41+05:30 IST