Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

ABN , First Publish Date - 2023-03-23T23:17:44+05:30 IST

ఆ మధ్య శ్రీకాంత్ (Srikanth), ఊహా (Ooha) విడిపోతున్నట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వెంటనే శ్రీకాంత్ ఆ వార్తలను కొట్టిపారేస్తూ.. అవి రూమర్స్ మాత్రమే.. మేము హ్యాపీగా ఉన్నామంటూ

Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..
Hero Srikanth with His Wife Ooha

ఆ మధ్య శ్రీకాంత్ (Srikanth), ఊహా (Ooha) విడిపోతున్నట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వెంటనే శ్రీకాంత్ ఆ వార్తలను కొట్టిపారేస్తూ.. అవి రూమర్స్ మాత్రమే.. మేము హ్యాపీగా ఉన్నామంటూ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దాంతో అంతటితో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. రీసెంట్‌గా.. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుపై ఏ విధంగా రూమర్స్ వ్యాపించాయో తెలియంది కాదు. వీటన్నింటిపై తాజాగా శ్రీకాంత్ మరోసారి స్పందించారు. గురువారం (మార్చి 23) శ్రీకాంత్ పుట్టినరోజు (Birthday). తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయనపై వచ్చిన రూమర్స్‌కు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాని (Social Media) ఎలా వాడాలో.. అలా వాడటం లేదు. దీనిలో మంచి, చెడు రెండూ ఉన్నాయి. ముఖ్యంగా యూట్యూబర్స్, సోషల్ మీడియాలో కొందరు.. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు వార్తలు రాసేస్తున్నారు. వీడియోలకు పెట్టే థంబ్‌నైల్స్ చూస్తుంటే ఒక్కోసారి బాధేస్తుంది. ఒకసారి నేను చనిపోయినట్లుగా రాశారు. మరోసారి నేను, నా భార్య విడాకులు తీసుకున్నట్లుగా రాశారు.. ఇలాంటివి చూసినప్పుడు నిజంగా చాలా బాధగా ఉంటుంది. ముఖ్యంగా మా అమ్మ, నాన్న వాళ్లు ఇవి చూస్తే.. వారికి ఏమవుతుందో అనే భయం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నా.. మళ్లీ ఎవరో ఒకరు ఇలానే రాస్తూ ఉంటారు. ఇది ఎవరికి వారుగా మారితే తప్ప.. ఏం చేయలేని పరిస్థితి.

Srikanth.jpg

రీసెంట్‌గా నేను, నా భార్య విడాకులు తీసుకుంటున్నట్లుగా వార్తలు పుట్టించారు. అప్పుడు మేం తిరుపతిలో ఉన్నాం. ఆ వార్తలు వినగానే షాకయ్యాను. వెంటనే క్లారిటీ ఇచ్చాను. ఆ వార్తల తర్వాత నా భార్యకు ఇష్టం లేకపోయినా.. ఫంక్షన్స్‌కు వెంటబెట్టుకుని తీసుకెళుతున్నాను. మొదటి నుంచి నా భార్య ఈవెంట్స్‌లో పెద్దగా కనిపించదు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు తప్పడం లేదు. రీసెంట్‌గా కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao)గారిపై వచ్చిన రూమర్ చూసి షాకయ్యాను. పాపం.. నేను బతికే ఉన్నానంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇవన్నీ చూస్తూ కూడా ఏం చేయలేం. ఇలాంటివి పుట్టించే వాళ్లు.. వారంతటికీ వారు మారాలి అంతే.. అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. కాగా, ఆయన ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన ‘వారసుడు’ (Vaarasudu) చిత్రంలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు RC15, అలాగే గురువారం ప్రారంభమైన NTR30 చిత్రాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-23T23:17:46+05:30 IST