Jaya Janaki Nayaka: హిందీలో దుమ్ముదులిపిన శ్రీనివాస్ మూవీ.. ఇది ఏ తెలుగు సినిమాకి లేని రికార్డు..

ABN , First Publish Date - 2023-03-29T15:00:37+05:30 IST

పలు తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయ్యి.. యూట్యూబ్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులని పలకరిస్తాయనే విషయం తెలిసిందే.

Jaya Janaki Nayaka: హిందీలో దుమ్ముదులిపిన శ్రీనివాస్ మూవీ.. ఇది ఏ తెలుగు సినిమాకి లేని రికార్డు..
Jaya Janaki Nayaka

పలు తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయ్యి.. యూట్యూబ్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులని పలకరిస్తాయనే విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అక్కడి ప్రేక్షకులు సైతం చాలా మన సినిమాలను బాగా ఆదరిస్తుంటారు. ఆ సినిమాల వల్లే తెలుగు హీరోలకి బాలీవుడ్‌లోనూ అభిమానులు ఏర్పడ్డారు. అల్లు అర్జున్, రామ్‌చరణ్, రామ్ పోతినేని వంటి పలువురు హీరోల సినిమాలు దుమ్ముదులుపుతుంటాయి. కొన్నిసార్లు తెలుగులో ప్లాప్ అయిన సినిమాలు సైతం రికార్డు స్థాయి వ్యూస్‌ని సంపాదిస్తూ ఉంటాయి.

తాజాగా టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ఫ్లాప్ మూవీ.. ఏ తెలుగు సినిమాకి లేని రికార్డుని సొంతం చేసుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) జంటగా నటించిన చిత్రం ‘జయ జానకి నాయక’ (Jaya Janaki Nayaka). 2017లో విడుదలైన ఈ మూవీ టాలీవుడ్‌‌లో ఫ్లాప్‌గా నిలిచింది. అయితే.. అనంతరం ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి ‘ఖూన్‌ఖర్’ (Khoonkhar)అనే పేరుతో యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేశారు. దాదాపు నాలుగేళ్ల క్రితం ఇప్పటి వరకూ దాదాపు 710 మిలియన్ల వరకు వ్యూస్‌ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించి సినిమాగా నిలిచింది. (Jaya Janaki Nayaka sets unique world record)

ఇది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమానే కాదు.. ప్రపంచంలోని ఎక్కువ వ్యూస్ సాధించిన సినిమాగా నిలవడం విశేషం. కాగా.. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రభాస్ ‘ఛత్రపతి’ని అదే పేరుతో బాలీవుడ్‌లో రిమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ రికార్డు ఆ మూవీ టీంకి కలెక్షన్లపరంగా ఉపయోగపడే అవకాశం చాలా ఉంది. (Jaya Janaki Nayaka world record on youtube)

గగన్, స్వీటీ ప్రేమించుకుంటారు. కానీ స్వీటీ తండ్రి అది ఇష్టం లేకపోవడంతో వారు విడిపోవాల్సి వస్తుంది. ఒక రోజు దుండగుల నుండి ఒక కుటుంబాన్ని రక్షించే సమయంలో.. గగన్ తనకు తెలియకుండా స్వీటీని కూడా రక్షిస్తాడు. తన భర్త చనిపోయిన విషయం తెలుసుకుని.. ఆమెను శత్రువుల నుంచి కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ చిత్ర కథాంశం.

ఇవి కూడా చదవండి:

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Vivek Agnihotri: రాహుల్ గాంధీపై కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు అధికారికం మాత్రమేనంటూ..

Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు..

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Updated Date - 2023-03-29T15:00:39+05:30 IST