Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

ABN , First Publish Date - 2023-03-29T08:50:48+05:30 IST

టాలీవుడ్‌‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఓ వెలుగు వెలుగి బాలీవుడ్‌లో సెటిల్ అయినా బ్యూటీ తాప్సీ పన్ను (Taapsee Pannu).

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..
Complaint on Taapsee Pannu

టాలీవుడ్‌‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఓ వెలుగు వెలుగి బాలీవుడ్‌లో సెటిల్ అయినా బ్యూటీ తాప్సీ పన్ను (Taapsee Pannu). ఇక్కడ స్టార్ హీరోల పక్కన ఆడిపాడిన ఈ భామ బీ టౌన్‌లో మాత్రం ఎక్కువగా కంటెంట్ ఉన్న సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా ఈ తారపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

tapsee2.jpg

తాప్సీ ఇటీవల ముంబయిలో జరిగిన లక్మీ ఫ్యాషన్‌ షో (Lakme Fashion Week)లో ర్యాంప్ వాక్ చేసింది. ఇందులో భాగంగా రెడ్ గౌన్‌లో, మెడలో లక్ష్మీదేవి లాకెట్‌తో ఈ బ్యూటీ మెరిసిపోయింది. దీని కారణంగా.. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ నటి తాప్సీ పన్నుపై కంప్లైంట్ నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌర్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఆ ఫిర్యాదులో.. ఫ్యాషన్ వీక్‌లో శరీర భాగాలు కనిపించేలా.. లక్ష్మీదేవితో కూడిన లాకెట్‌ను ధరించి మతపరమైన మనోభావాలు, సనాతన ధర్మం ప్రతిష్టను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. (Complaint filed against Taapsee Pannu)

Tapsee1.jpg

కాగా.. ఆ లాక్మే ఫ్యాషన్ వీక్ అనంతరం దానికి సంబంధించిన ఓ వీడియోని తాప్సీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి.. ఆ సమయంలో ధరించిన గౌను, ఆభరణాల కారణంగా మహారాణి అనిపించినట్లు తాప్పీ రాసుకొచ్చింది. కాగా.. ఏకలవ్య గౌర్ 2021 సంవత్సరంలో ప్రముఖ కమెడియన్, లాకప్ విన్నర్ మునావర్ ఫరూఖీపై ఫిర్యాదు చేశారు.దీంతో ఆ నటుడిని అరెస్టు కూడా చేశారు. (Goddess Laxmi neckpiece)

ఇవి కూడా చదవండి:

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Vivek Agnihotri: రాహుల్ గాంధీపై కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు అధికారికం మాత్రమేనంటూ..

Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు..

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Updated Date - 2023-03-29T09:01:18+05:30 IST