Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

ABN , First Publish Date - 2023-03-27T11:18:03+05:30 IST

భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే (Akanksha Dubey) (25) బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..
Akanksha Dubey

భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే (Akanksha Dubey) (25) బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆదివారం (మార్చి 26న) వారణాసిలోని సారనాథ్‌ హోటల్‌లోని గదిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సినిమా షూటింగ్ కోసం ఆకాంక్ష వారణాసికి వచ్చారు. షూటింగ్‌ పూర్తి చేసిన అనంతరం హోటల్‌కు తిరిగొచ్చాక ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పార్సీపూర్‌ ఆమె స్వస్థలం. భోజ్‌పురి (Bhojpuri)లో ‘ఫైటర్‌కింగ్‌’, ‘వీరోంకే వీర్‌’ వంటి పలు మూవీలలో నటించారు.

కాగా.. ఆకాంక్ష మృతి విషయం తెలిసి భోజ్‌పురి చిత్ర పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. దీంతో పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో యువనటికి సంతాపం తెలుపుతున్నారు. అంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునే ముందురోజు ఆకాంక్ష ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని ఆమె అభిమానుల కొందరూ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. (Bhojpuri actress Akanksha Dubey)

ఆ వీడియోలో.. ఆకాంక్ష చాలా సేపు ఏం మాట్లాడకుండా డల్‌గా ఉండిపోయారు. ఏదో చెప్పాలని ఉన్నా చెప్పలేక బాధగా చూస్తుండిపోయారు. కొద్దిసేపు తర్వాత నోటికి చేతిని అడ్డుపెట్టికొన్ని వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. ఆమెని ఎవరో టార్చర్ పెడితే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు‌గా ఉందని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై కచ్చితంగా విచారణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

‘ఆకాంక్ష ముందురోజు సాయంత్రం ఓ బర్త్ డే పార్టీకి వెళ్లొచ్చింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాతే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ పెట్టి ఏడ్చారు. ఆ పార్టీలో ఏదో జరిగి ఉంటుంది. అదే ఆమె బలవన్మరణానికి కారణమై ఉంటుంది. లేదా ఇది సూసైడ్ కాకపోవచ్చు’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కాగా.. ఈ కేసు విషయమై వారాణాసి అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ.. ‘ప్రాథమిక నివేదిక ప్రకారం ఇది ఆత్మహత్యే కావచ్చు. అయితే మరణానికి గల కారణాలు తెలియాలంటే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సిందే’ అని చెప్పుకొచ్చారు. కాగా.. ఆకాంక్ష గత కొంతకాలంగా సహనటుడు సమర్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నారు.

Updated Date - 2023-03-27T11:25:52+05:30 IST