Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు.

ABN , First Publish Date - 2023-03-27T14:37:39+05:30 IST

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) వివాదం గురించి తెలిసిందే.

Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు.
Nawazuddin Siddiqui brother Shamas

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) వివాదం గురించి తెలిసిందే. ఆయనపై భార్య ఆలియా (Aaliya), సోదరుడు షమాస్ నవాబ్ సిద్ధిఖీ నటుడు తమని మోసం చేశాడంటూ ఆరోపణలు చేశారు. దీంతో.. వారిద్దరే తనని మోసం చేశారు.. తన పరువు తీశారంటూ.. తాజాగా నవాజ్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ఆ కేసు దాఖలు చేసిన కొన్ని గంటల్లోనే నటుడి సోదరుడు షమాస్ స్పందించాడు.

నవాజుద్దీన్‌పై కొత్తగా సోదరుడికి ముగ్గురు భార్యలు ఉన్నారని, ఆయనపై పలు వేధింపుల కేసులు ఉన్నాయని షమాస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. దానికి సంబధించి ఓ పెద్ద నోట్‌లో ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అందులో.. ‘నా సోదరుడు నా విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాడు. దాని వల్ల నా జీవితంలో విలువైన 11 సంవత్సరాలను నష్టపోయాను. ఆయన 11 క్రైమ్స్ చేశాడు. అంతేకాదు.. ఆయన మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. అందులో ఒకటి లాక్డౌన్ సమయంలో జరిగింది. అలాగే.. అందులో ఒకరిని గర్భవతిగా ఉన్నప్పుడే బయటకి వెళ్లగొట్టాడు. ఆ కేసునే ప్రస్తుతం యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాటితో పాటు, నవాజ్‌పై రెండు మీ టూ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన తన తోటి నటీమణులను కూడా వేధించాడు. సోదరుడు అలంసుద్దీన్‌తో పాటు మరికొందరు మా కుటుంబ సభ్యులు కూడా నవాజ్‌పై కేసు పెట్టారు’ అని తీవ్రంగా ఆరోపించాడు. (Defamation Case)

అంతేకాకుండా.. నవాజ్ వల్ల తన సినిమా నిర్మాతలు భారీగా నష్టపోయారని కూడా షమాస్ తెలిపాడు. ‘మీ జుగుప్సాకరమైన ప్రకటనల కారణంగా మీ తొమ్మిది సినిమాలు ఆగిపోయాయి. నటుడిగా ఇప్పుడు నీకు ఎటువంటి విలువ లేదు’ అని ఘాటుగా రాసుకొచ్చాడు.

కాగా.. భార్య ఆలియా, సోదరుడు షమాస్ మీద నవాజుద్దీన్ వేసిన రూ.100 కోట్ల పరువు నష్టం దావా కేసు మార్చి 30న విచారణలోకి రానుంది. అయితే.. నవాజ్, ఆలియా అలియాస్ అంజనా పాండేకి 2009 వివాహం జరిగింది. వారికి ఇద్దరూ పిల్లలు యాని, షోరా. అయితే.. నటుడితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా వేధింపులకి గురి చేస్తున్నారని ఆలియా కేసు నమోదు చేసింది. దీంతో గత కొన్నేళ్లుగా వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. అలాగే ముంబై బంగ్లాకి సంబంధించిన ఆస్తిపై కూడా ఆలియా కేసు వేసింది. ఆ ఆరోపణలు అన్నింటినీ నవాజ్ ఇప్పటికే ఖండించాడు.

ఇవి కూడా చదవండి:

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Updated Date - 2023-03-27T14:40:05+05:30 IST