Vivek Agnihotri: రాహుల్ గాంధీపై కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు అధికారికం మాత్రమేనంటూ..

ABN , First Publish Date - 2023-03-28T08:44:07+05:30 IST

‘ది కాశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri).

Vivek Agnihotri: రాహుల్ గాంధీపై కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు అధికారికం మాత్రమేనంటూ..
Vivek Agnihotri on rahul gandhi

‘ది కాశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri). 1990లలో కశ్మీర్ పండిట్లపై జరిగిన దురాగతాలను కళ్లకు కట్టినట్లు చూపించిన ఆ చిత్రానికి ప్రేక్షకులు భారీ విజయాన్ని అందించారు. కాగా.. అప్పటి నుంచి ఆయన నుంచి మరో సినిమా ఎప్పుడొస్తుందా అని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే ‘ది వ్యాక్సిన్ వార్’ అనే చిత్రంతో బాక్సాఫీస్‌ని పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీని హిందీతో పాటు మొత్తం పలు భాషల్లో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.

అయితే.. వివేక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే విషయం తెలిసిందే. దేశంలో జరిగిన వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు. ఈ దర్శకుడు తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని రోజుల క్రితం మోదీ(Modi)ల గురించి రాహుల్ గాంధీ చేసిన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ కారణంలో శిక్ష పడడంతో పార్లమెంట్ రాహుల్‌పై అనర్హత (Disqualified) వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివేక్ వ్యగ్యంగా ట్వీట్ చేశాడు. అది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వివేక్ షేర్ చేసిన ట్వీట్‌లో.. ‘రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే’ అని రాసుకొచ్చాడు. అనంతరం కొన్ని గంటల తర్వాత వివేక్ మరో ట్వీట్ చేశాడు. అందులో.. ‘గతంలో ఇందిరాగాంధీ (Indira Gandhi)పై అనర్హత వేటు పడిన సమయంలో కూడా కాంగ్రెస్‌ వాదులు దుమ్మెత్తిపోశారు. కానీ ఆమె నిజమైన నాయకురాలు కాబట్టి ఆమె తిరిగి పుంజుకుంది. అయితే సరైన నాయకుడు ఎవరూ లేకపోవడంతో ఇకపై కాంగ్రెస్ (Congress) ఏం చేస్తుందో చూడాలి’ అని తనదైన శైలిలో రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు..

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్


మోదీల గురించి రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపడంతో ఆయనపై కొన్ని రోజుల క్రితం.. సూరత్ కోర్టు‌లో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఆ పిటిషన్‌ని విచారించిన కోర్టు రాహుల్‌‌కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన పార్లమెంట్, 8 సంవత్సరాల పాటు అనర్హత వేటు కూడా వేసింది.

Updated Date - 2023-03-28T08:44:08+05:30 IST