Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

ABN , First Publish Date - 2023-03-28T14:54:03+05:30 IST

ఈ ఏడాది దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి.

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..
Update on Adipurush release

ఈ ఏడాది దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి. అందులో ఎటువంటి సందేహం లేదు. భారతీయ ఇతిహాసం రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సీతగా కృతి సనన్ (Kriti Sanon), లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) నటిస్తున్నారు. టీ-సిరీస్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 16న విడుదల చేసేందుకు మూవీ టీం చేస్తోంది.

నిజానికి.. ఈ సినిమాని ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. దానికి అనుగుణంగానే, ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ని కూడా చాలా గ్రాండ్ విడుదల చేశారు. అయితే.. ఈ టీజర్ చాలామంది సినీ లవర్స్‌కి నచ్చలేదు. ఆ చిత్రంలో ప్రభాస్‌తో పాటు వానరుల యానిమేషన్ చాలా దారుణంగా ఉన్నాయని ట్రోలింగ్ చేశారు. అలాగే.. రావణుడి గెటప్ సైతం తాలిబన్లను పోలి ఉందని విమర్శలు చేశారు. దీంతో చిత్ర విడుదలపై మూవీ టీం వెనక్కి తగ్గింది. దిద్దుబాటు చర్యలకు దిగింది. అప్పుడే ఈ మూవీని జూన్ 16న విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు. (Adipurush Release Date)

కానీ.. చిత్ర విడుదల ద్గగర పడుతున్న కొద్దీ ఈ మూవీ రిలీజ్ గురించి రకరకాల రూమర్స్ ప్రచారం అయ్యాయి. ఇంకా వీఎఫ్‌ఎక్స్ పూర్తి కానందున చిత్ర విడుదల మరోసారి వాయిదా పడనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. దీంతో ఏదో ఒక అప్డేట్ ఇవ్వమని, చిత్ర ప్రమోషన్స్ స్టార్ట్ చేయమని ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. ఈ తరుణంలో వారి అనుమానాలను పటాపంచలు చేసేస్తూ.. మేకర్స్ ఓ పోస్టును షేర్ చేశారు. (Adipurush Update)

అందులో.. ‘అంత మంచే జరగాలని ఆశిస్తూ.. వైష్ణో దేవి వద్ద దైవ ఆశీర్వాదం తీసుకున్నాం. ఆదిపురుష్ జూన్ 16, 2023న 3Dలో థియేటర్‌లలో విడుదల అవుతుంది’ అని రాసుకొచ్చారు. అలాగే.. వైష్ణో దేవి ఆలయం వద్ద దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ కలిసి దిగిన ఓ పిక్‌ని షేర్ చేశారు. దీంతో.. ఇప్పటికైనా ఓ క్లారిటీ ఇచ్చారు సంతోషం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే.. అందరికీ పిచ్చేక్కిపోయేలా ఏదో ఒక అప్డేట్ ఇవ్వమని రిక్వెస్టులు చేస్తున్నారు. (Adipurush Latest Update)

ఇవి కూడా చదవండి:

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Vivek Agnihotri: రాహుల్ గాంధీపై కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు అధికారికం మాత్రమేనంటూ..

Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు..

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

Updated Date - 2023-03-28T15:09:26+05:30 IST