Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-28T14:13:01+05:30 IST

ఓ వైపు సినిమాపరంగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పెద్ద స్టార్‌.. మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ సినీ పరిశ్రమ (Bollywood Film Industry) ని కింగ్‌లా ఏలుతున్నాడు.

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..
Shah Rukh Khan and Virat Kohli fanwar

ఓ వైపు సినిమాపరంగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పెద్ద స్టార్‌.. మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ సినీ పరిశ్రమ (Bollywood Film Industry) ని కింగ్‌లా ఏలుతున్నాడు. మరోవైపు క్రికెట్ పరంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) పెద్ద స్టార్.. దాదాపు దశాబ్దకాలంగా క్రికెట్ (Cricket) ప్రపంచాన్ని ఏలుతున్నాడు. సినీ లవర్స్ షారుఖ్‌ని కింగ్ ఖాన్ (King Khan) అని.. స్పోర్ట్స్ లవర్స్ విరాట్‌ని కింగ్ కోహ్లీ (King Kohli) అని పిలుచుకుంటూ ఉంటారు. కాగా.. ఈ ఇద్దరికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. షారుఖ్ సినిమా ‘రబ్ నే బనా ది జోడి’తో విరాట్ భార్య అనుష్క శర్మ సినీ పరిశ్రమకి పరిచయమైన విషయం తెలిసిందే. దాని వల్ల ఈ ఇద్దరు స్టార్ల మధ్య మంచి స్నేహమే ఉంది.

అలాగే, సమయం వచ్చినప్పుడల్లా.. షారుఖ్, విరాట్ ఒకరి గురించి ఒకరు గౌరవంగా మాట్లాడుకుంటారు. కానీ, విచారకరంగా డిజిటల్ ప్రపంచం వేరు. నిజ జీవితాలకు అనుసరిస్తూ అది ప్రయాణించదు. త్వరలోనే ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ స్టార్ల ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. మొదట వృత్తిపరంగా ఒకరిని ఒకరు దూషించుకోగా.. అనంతరం అది వ్యక్తిగత జీవితాల వైపు మళ్లింది. దాంతో.. ఇరువర్గాలు స్టార్ల కుటుంబాల గురించి అసభ్యకరంగా ఆరోపణలు చేస్తూ.. ట్వీట్లు చేస్తున్నారు. (Fans Fight about Shah Rukh Khan and Virat Kohli)

మా స్టార్ గొప్ప అంటే మా స్టార్ గొప్ప అని ట్వీట్ల వార్ చేసుకుంటున్నారు. ‘ఆస్ట్రేలియాలోని గ్రౌండ్‌లో లక్షమంది జనం ఒకేసారి కోహ్లీ నామజపం చేశారు. దానికి షారుఖ్‌కి 35 సంవత్సరాలు పట్టింది’ అని కోహ్లీ ఫ్యాన్స్ అంటే.. ‘ఈ ఒక్క సీన్ విరాట్ కోహ్లీ మొత్తం కెరీర్ కంటే ఎక్కువ’ అని షారుఖ్ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. అయితే.. మరికొందరు మాత్రం.. ‘విరాట్, షారుఖ్ ఇద్దరూ దేశం గర్వించదగ్గ స్టార్లే. వారిద్దరూ దేశానికి ప్రతినిధులుగా ఉన్నారు. చిన్న పిల్లల్ల కొట్టుకోవడం మానేయండి’ అని రాసుకొస్తున్నారు. (Shah Rukh Khan and Virat Kohli Fans ugly Fight)

Updated Date - 2023-03-28T14:54:57+05:30 IST