Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

ABN , First Publish Date - 2023-03-28T11:05:53+05:30 IST

భోజ్‌పురి (Bhojpuri) యువ నటి ఆకాంక్ష దూబే (Akanksha Dubey) ఆత్మహత్య గురించి తెలిసిందే.

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..
Akanksha Dubey Suicide

భోజ్‌పురి (Bhojpuri) యువ నటి ఆకాంక్ష దూబే (Akanksha Dubey) ఆత్మహత్య గురించి తెలిసిందే. 25 ఏళ్ల నటి సూసైడ్‌తో భోజ్‌పురి చిత్ర పరిశ్రమతో పాటు దేశం మొత్తం షాక్‌కి గురైంది. అంతేకాకుండా.. నటి మరణంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆకాంక్ష తల్లి మధు దూబే (Madhu Dubey) కొత్త ట్విస్ట్ ఇచ్చింది. నటి ప్రియుడు సమర్ సింగ్‌ (Samar Singh)పై మధు షాకింగ్ ఆరోపణలు చేసింది.

ఆకాంక్ష తల్లి ముధు మాత్రం సమర్ సింగ్, అతని సోదరుడి మానసిక హింస, వేధింపుల కారణంగానే తన కుమార్తె ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని తెలిపింది. మధు దుబే ఆరోపణల ప్రకారం.. ఆకాంక్షకి, సమర్ సోదరుడు కలిసి ఓ ప్రాజెక్టుకి పని చేశారు. దానికి సంబంధించిన చెల్లింపుల విషయమై వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. దాంతో.. సమర్‌తో పాటు అతని సోదరుడు ఆకాంక్షని చంపుతామని బెదిరించారు. ఆకాంక్షని ఆ సోదరులు రూ.లక్షల్లో మోసం చేశారని మధు తెలిపింది. (Allegations against boyfriend Samar Singh)

దీంతో.. ఆకాంక్షని ఆత్మహత్యకి ప్రేరేపించినట్లు సమర్ సింగ్‌తో పాటు అతని సోదరుడిపై కేసు నమోదైంది. త్వరలోనే వారి మధ్య ఏం జరిగిందనే విషయాలపై పూర్తిస్తాయి విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే.. ఓ పార్టీకి హాజరైన కొద్ది గంటల్లోనే వారణాసిలోని ఓ హోటల్ గదిలో నటి ఆకాంక్ష ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేయగా.. ప్రాథమిక నివేదికలు ఆమెదీ ఆత్మహత్యే అని సూచిస్తున్నాయి. గది లోపలి నుంచి తాళం వేసి ఉందని, ఆమె మృతిలో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు తెలియట్లేదని పోలీసులు తెలిపారు. (Bhojpuri actress Akanksha Dubey)

అయితే.. ఆత్మహత్యకు ముందు ఆకాంక్ష ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చింది. దానికి సంబంధించిన వీడియోని అభిమానులు ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది కూడా. అందులో.. ఆకాంక్ష చాలా సేపు ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. అలా కొద్దిసేపు తర్వాత నోటికి చేతిని అడ్డుపెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ వైరల్ వీడియోని చూసిన పలువురు ఫ్యాన్స్.. ఆమెని ఎవరో టార్చర్ పెడితే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు‌గా ఉందని, అందుకే సరైన విధంగా విచారణ చేయాలని డిమాండ్ కూడా చేశారు. (Akanksha Dubey death case)

ఇవి కూడా చదవండి:

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Vivek Agnihotri: రాహుల్ గాంధీపై కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు అధికారికం మాత్రమేనంటూ..

Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు..

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Updated Date - 2023-03-28T11:05:55+05:30 IST