Allari Naresh: ఛోటా భీమ్ సృష్టికర్తతో అల్లరి నరేష్ చిత్రం.. ఫరియా హీరోయిన్!

ABN , First Publish Date - 2023-03-22T20:04:01+05:30 IST

కామెడీతోనే కాకుండా భిన్నమైన పంథాను అనుసరించి తాను కామెడీతో పాటు ఇంటెన్స్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకుంటున్న అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా తాజాగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఉగాది (Ugadi) పర్వదినం సందర్భంగా..

Allari Naresh: ఛోటా భీమ్ సృష్టికర్తతో అల్లరి నరేష్ చిత్రం.. ఫరియా హీరోయిన్!
Allari Naresh New Movie Opening

కామెడీతోనే కాకుండా భిన్నమైన పంథాను అనుసరించి తాను కామెడీతో పాటు ఇంటెన్స్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకుంటున్న అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా తాజాగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఉగాది (Ugadi) పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు మల్లి అంకం (Malli Ankam) దర్శకత్వం వహిస్తుండగా.. చిలకా ప్రొడక్షన్స్ (Chilaka Productions) ప్రొడక్షన్ నంబర్ 2గా ఛోటా భీమ్ సృష్టికర్త రాజీవ్ చిలక (Rajiv Chilaka) నిర్మిస్తున్నారు.

Allari-3.jpg

‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. కథలో యూనిక్ పాయింట్‌తో పాటు కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు సంవత్సరాది సందర్భంగా ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేయడంతో పాటు మేకర్స్ ఈరోజు గ్రాండ్‌గా ప్రారంభ వేడుకను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యంగ్ డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టారు. ఫస్ట్ షాట్‌కు ‘ప్రాజెక్ట్ K’ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్ చేశారు. జెమినీ కిరణ్ మరియు శరత్ మరార్.. యూనిట్‌కు స్క్రిప్ట్ అందజేశారు. (Allari Naresh New Film Launched)

Allari-4.jpg

ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఇది చాలా మంచి కామెడీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు నా నుంచి కోరుకునే ఫన్ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా అన్నీ ఇందులో వుంటాయి. ఏప్రిల్ 10 నుంచి షెడ్యుల్ స్టార్ట్ అవుతుందని (Allari Naresh About His New Film) అన్నారు. హీరోయిన్ ఫరియా మాట్లాడుతూ.. కొత్త ఏడాదిని కొత్త సినిమాతో మొదలుపెడుతున్నందుకు ఆనందంగా వుంది. చిలకా ప్రొడక్షన్స్‌కి కృతజ్ఞతలు. నరేష్ గారితో పని చేయడం చాలా ఎక్సయిటింగ్‌గా వుంది. సినిమా అదిరిపోతుందనే నమ్మకం వుందని తెలిపారు.

Allari-2.jpg

ఛోటా భీమ్ సృష్టికర్త (Creator of the Chhota bheem) రాజీవ్ చిలక 20 సంవత్సరాలకు పైగా యానిమేషన్ & మీడియా పరిశ్రమలో అగ్రగామిగా ఉన్నారు. ఇప్పుడు కొత్త బ్యానర్ “చిలక ప్రొడక్షన్స్”తో లైవ్ యాక్షన్ మూవీ ప్రొడక్షన్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు మల్లి నాకు పదేళ్ళుగా తెలుసు. ఆయనతో సినిమా చేస్తానని పదేళ్ళ క్రితమే చెప్పాను. ఈ కథ చెప్పినపుడు.. ఈ కథకు నరేష్‌గారు మాత్రమే న్యాయం చేయగలరనిపించింది. నరేష్ గారితో సినిమా చేయడం ఆనందంగా వుంది. ఫరియాతో పాటు యూనిట్ అందరికీ కృతజ్ఞతలు అని అన్నారు.

Allari-1.jpg

చిత్ర దర్శకుడు మల్లి మాట్లాడుతూ.. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నరేష్‌గారికి, ఫరియా‌గారికి కృతజ్ఞతలు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. రవిగారు నా కథని మరో స్థాయికి తీసుకెళ్ళారు. అందరూ గర్వపడే సినిమా చేస్తాననే నమ్మకం వుందని తెలిపారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేయనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. (Allari Naresh New Film Launch Details)

ఇవి కూడా చదవండి:

*********************************

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Brahmanandam: వన్ మోర్ అన్నావంటే కృష్ణవంశీని చంపేస్తానన్నాడు

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

*Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్

*Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-22T20:04:02+05:30 IST