Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2023-03-20T14:08:44+05:30 IST

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) కలిసి

Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
Ram Charan and Jr NTR

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో పలు వేదికలపై ఎన్టీఆర్-చరణ్ (NTR and Charan) కలిసి కనిపించారు. ఒకరికి ఒకరు స్నేహితులమని చెప్పుకున్నారు. సినిమా పరంగా మా మధ్య పోటీ ఉంటుంది కానీ.. మాములుగా మాత్రం మాది సోదర బంధం అని.. ఇద్దరిలో ఎవరి పుట్టినరోజు వచ్చినా.. ఇద్దరం కలిసి బయటికి చెక్కేస్తాం అన్నట్లుగా వారు వెల్లడించిన విషయాలు వినీ.. ఇరు హీరోల అభిమానులు షాక్ అయ్యారు. ఎందుకంటే.. అసలీ సినిమా అనౌన్స్ చేసినప్పుడే.. నిజంగా కార్యరూపం దాల్చుతుందా? అనేలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. రీసెంట్‌గా రామ్ చరణ్ (Ram Charan) చెప్పినట్లుగా రాజమౌళి కాబట్టే ఈ కాంబినేషన్‌తో సినిమా సెట్స్‌పైకి వెళ్లింది.. లేదంటే ప్రకటన దగ్గరే ఆగిపోయేది. అలాగే.. ఎన్టీఆర్-చరణ్ కాబట్టే ఈ సినిమా గురించి అంతలా అందరూ చర్చలు జరిపారు. ఇవాళ ఆస్కార్ (Oscar) కొట్టి.. అందరినీ ముఖ్యంగా తెలుగు వారంతా గర్వపడేలా చేసిందీ చిత్రం. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి మరోసారి ఒకే స్టేజ్‌పై కనిపించబోతున్నట్లుగా వార్తలు వినవస్తున్నాయి. ఆ వివరాలలోకి వెళితే..

అక్కినేని హీరో కోసం త్వరలో ఎన్టీఆర్-చరణ్ ఒకే స్టేజ్‌పై కనిపించబోతున్నారని తెలుస్తోంది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏజెంట్’ (Agent). పాన్ ఇండియా సినిమాగా.. అఖిల్ అక్కినేని కెరీర్‌లోని హయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా జరగనున్న ప్రీ రిలీజ్ వేడుకకు రామ్ చరణ్, ఎన్టీఆర్‌‌లను ముఖ్య అతిథులుగా తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందుకోసం కింగ్ నాగార్జున (King Nagarjuna) కూడా ఇప్పటికే ఇద్దరినీ సంప్రదించినట్లుగానూ, వారిద్దరూ అందుకు ఓకే చెప్పినట్లుగా టాక్ నడుస్తుంది. దీంతో ‘ఏజెంట్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు విశిష్టత సంతరించుకుంది. అంతేకాదు, ఈ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ హీరోలని ఘనంగా సన్మానించేందుకు ‘ఏజెంట్’ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Akhil-with-RRR-heroes.jpg

‘ఏజెంట్’ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ (Vakkantham Vamsi) అందించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments), సురేందర్ 2 సినిమా (Surender 2 Cinema) పతాకాలపై రామబ్రహ్మం సుంకర (Ramabrahmam Sunkara) నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించారు. యూనిక్ స్పై థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటించగా.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

*Young Tiger NTR: విశ్వక్ సేన్ దర్శకత్వం మానేయాలని కోరుకుంటున్నా..

*Jr NTR: ఆస్కార్ క్రెడిట్ ఎవరిదంటే.. ఎన్టీఆర్ స్పీచ్ వైరల్

*Bigg Boss Himaja: ఘోరంగా ఏడ్చాను.. కానీ?

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-20T14:08:46+05:30 IST