Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

ABN , First Publish Date - 2023-03-22T17:48:24+05:30 IST

వరల్డ్ సినిమా ప్రపంచంలో తెలుగు సినిమా ప్రేక్షకుల దారే వేరు. సినిమాని, హీరోలని.. తెలుగు ప్రేక్షకులు అభిమానించినంతగా.. మరే ఇతర ప్రేక్షకులు అభిమానించరనేది.. ఇటీవల విడుదలవుతోన్న సినిమాలను

Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?
Das ka Dhamki and Dhamaka

వరల్డ్ సినిమా ప్రపంచంలో తెలుగు సినిమా ప్రేక్షకుల దారే వేరు. సినిమాని, హీరోలని.. తెలుగు ప్రేక్షకులు అభిమానించినంతగా.. మరే ఇతర ప్రేక్షకులు అభిమానించరనేది.. ఇటీవల విడుదలవుతోన్న సినిమాలను చూస్తుంటే తెలుస్తోంది. ఇతర భాషల సినిమాలు కూడా తెలుగులో ఘన విజయం సాధిస్తుంటాయి. అలాంటిది ఇష్టమైన హీరో సినిమా థియేటర్లలోకి వస్తే.. ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే అభిమానించే హీరో సినిమా విడుదలైన మొదటి రోజు.. మొదటి ఆటను చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. అలా.. తాజాగా విడుదలైన విశ్వక్ సేన్ (Vishwak Sen) ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) సినిమా చూడటానికి వెళ్లిన వీర అభిమానులని అవాక్కయ్యేలా చేశారు థియేటర్ వారు. ‘దాస్ కా ధమ్కీ’ ప్లేస్‌లో ‘ధమాకా’ (Dhamaka) షో ప్రదర్శించారు. దీంతో షాకవడం ఫ్యాన్స్ వంతైంది. థియేటర్లో ఉన్న ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా కేకలు వేయడంతో.. తప్పు తెలుసుకున్న థియేటర్ వారు.. వెంటనే సినిమాని ఆపేసి.. ‘దాస్ కా ధమ్కీ’ షో వేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్ (Nivetha Peturaj) హీరోహీరోయిన్లుగా విశ్వక్ దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. పాన్ ఇండియా (Pan India) సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఉగాది (Ugadi) స్పెషల్‌గా నేడు (మార్చి 22) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే వైజాగ్ సుకన్య (Vizag Sukanya Theater) థియేటర్‌కి ఈ సినిమా చూడటానికి వెళ్లిన వారంతా షాకయ్యారు. షో ని ప్రదర్శించే వారు పొరబడటంతో.. ‘దాస్ కా ధమ్కీ’ ప్లేసులో ‘ధమాకా’ షో‌ని ప్లే చేశారు. దీంతో చూస్తున్న వారంతా.. ఇదేందయ్యా.. ధమాకా కాదు.. ధమ్కీ వేయండి అంటూ కేకలు వేయడంతో.. వెంటనే తేరుకున్న థియేటర్ వారు ‘ధమాకా’ (Dhamaka Movie) ఆపేసి మళ్లీ ‘దాస్ కా ధమ్కీ’ షో వేశారు. ఇదంతా వీడియో తీసిన వారు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇప్పుడంతటా దీని గురించే చర్చలు నడుస్తున్నాయి.

అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అటు ‘ధమాకా’, ఇటు ‘దాస్ కా ధమ్కీ’.. రెండు సినిమాల కాన్సెఫ్ట్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. అలాగే ఈ రెండు సినిమాల కథ వెనుక ఒకే పర్సన్ పని చేయడం విశేషం. అందుకే థియేటర్ వారు కాస్త కన్ఫ్యూజ్ అయ్యింటారు. ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టీజర్ రిలీజ్ సమయంలో నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ఈ సినిమాకు సపోర్ట్ అందిస్తే.. ఆస్కార్ వేడుక నుంచి వచ్చిన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో భాగమయ్యారు. నందమూరి హీరోల సపోర్ట్‌తో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడా అంచనాలను అందుకుని.. విశ్వక్ ‘ధమ్కీ’ ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి మిక్స్‌డ్ టాకే వినబడుతోంది. (Das Ka Dhamki Talk)


ఇవి కూడా చదవండి:

*********************************

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Brahmanandam: వన్ మోర్ అన్నావంటే కృష్ణవంశీని చంపేస్తానన్నాడు

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

*Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్

* Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-22T17:48:26+05:30 IST