Brahmanandam: వన్ మోర్ అన్నావంటే కృష్ణవంశీని చంపేస్తానన్నాడు

ABN , First Publish Date - 2023-03-21T17:08:06+05:30 IST

ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramya Krishnan), బ్రహ్మానందం (Brahmanandam) ప్రధానపాత్రలలో.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). మరాఠీ సూపర్ హిట్

Brahmanandam: వన్ మోర్ అన్నావంటే కృష్ణవంశీని చంపేస్తానన్నాడు
Rangamarthanda Team

ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramya Krishnan), బ్రహ్మానందం (Brahmanandam) ప్రధానపాత్రలలో.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా ‘నట్ సామ్రాట్’ (Natsamrat)కి అఫీషియల్ తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది (Ugadi) సందర్భంగా మార్చి 22న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, శివాత్మిక, అలీ రేజా, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు తాజాగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) మాట్లాడుతూ... దర్శకుడు కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ వచ్చి ఈ సినిమాలో నన్ను నటించాలని అడిగినప్పుడు కొంత ఆశ్చర్యపోయాను. మీరు తప్పితే ఈ పాత్రకు ఎవరు సరికారు అని కూడా అన్నారు. కొన్ని సన్నివేశాలు పూర్తి చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ ఓ రాత్రి ఫోన్ చేసి ఈరోజు షూటింగ్లో మీరు చేసిన సీన్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేవారు. ఆ విషయం ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చెప్పారు అంటే ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ప్రకాష్ రాజ్ తెలుగు వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా అతనికి తెలుగుపై చాలా పట్టుంది. అందులో సినిమాలోని డైలాగ్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేశాడో కానీ అద్భుతంగా చెప్పాడు. కొన్ని సన్నివేశాలు బాగా రాకపోయినప్పటికీ కూడా కొన్ని సీన్స్ కట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అని మొదట అన్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ సింగిల్ టేక్‌లోనే కావాలని అన్నారు. ఆ తర్వాత నేను సింగిల్ టేక్‌లోనే చేయడం జరిగింది. దీంతో ప్రకాష్ రాజ్ పక్కనే ఉండి ఇది వన్ మోర్ అన్నావంటే చంపేస్తాను అని కృష్ణవంశీకి హెచ్చరిక చేశాడు. ఒక సన్నివేశంలో నేను నటించిన తర్వాత రమ్యకృష్ణ నాకు నమస్కారం పెట్టేశారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని కృష్ణవంశీ ఎంతో చక్కగా తెరపైకి తీసుకువచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్రకాష్ రాజ్ విశ్వరూపం చూపించారు. అలాగే రమ్యకృష్ణ మిగతా నటీనటులు కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. ఇక ఇలాంటి సినిమాలు అందరూ చూడాలి. తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఇది.. అని చెప్పుకొచ్చారు. (Brahmanandam about Rangamarthanda)

Brahmanandam.jpg

కాగా.. హౌస్ ఫుల్ మూవీస్ (Housefull Movies), రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ (Raja Shyamala Entertainments) బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతం అందించారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ భారీ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికే ప్రదర్శించిన స్పెషల్ షోలకు కూడా అద్భుతమైన స్పందనను ఈ చిత్రం రాబట్టుకుంది. (Rangamarthanda Press Meet)

ఇవి కూడా చదవండి:

*********************************

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

*Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్

* Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-21T17:08:08+05:30 IST