Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్

ABN , First Publish Date - 2023-03-20T16:56:44+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) ‘కార్తికేయ 2’ (Karthikeya 2)తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా మంచి..

Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్
Nikhil Siddhartha

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) ‘కార్తికేయ 2’ (Karthikeya 2)తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా మంచి విజయాన్ని అందుకుంది. కార్తికేయ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 121 కోట్లకు పైగా వసూలు చేసింది. కలెక్షన్స్ విషయంలోనే కాకుండా.. ఈ చిత్రం హీరో నిఖిల్‌ను పాన్ ఇండియా (Pan India) స్టార్‌గా నిలబెట్టింది. ఈ చిత్రం ఉత్తరాది, దక్షిణాది‌లో అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అలాగే ఈ చిత్రం టీవీ ప్రీమియర్ మరియు OTT స్ట్రీమింగ్‌లో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని మంచి రేటింగ్స్‌ను సొంతం చేసుకుంది. ప్రశంసలు, వసూళ్లు మాత్రమే కాకుండా ఇప్పుడు అవార్డుల విభాగంలోనూ నిఖిల్ తన సత్తాను చాటుకున్నారు. ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023 (Iconic Gold Awards 2023)లో ‘కార్తికేయ 2’ చిత్రంలోని నటనకుగానూ నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా (Best Actor) ఎంపికయ్యారు. బాలీవుడ్‌లో విడుదలైన చిత్రాలకు, అక్కడ టీవీ షోలకు ఈ అవార్డును ఇస్తుంటారు. అలాంటిది బాలీవుడ్‌లో విడుదలైన ‘కార్తికేయ 2’ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా నిఖిల్ అవార్డ్‌ను గెలుచుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.

అవార్డును అందుకున్న అనంతరం నిఖిల్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు తనపై చూపిన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలని.. ఈ అవార్డ్‌తో తన బాధ్యత మరింతగా పెరిగినట్లుగా భావిస్తున్నానని తెలిపారు. ‘కార్తికేయ 2’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People meida factory), అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ (Abhishek Agarwal arts) బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో చందు మొండేటి కృష్ణ తత్వాన్ని, మహిమను చెప్పడంతో పాటు, పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ప్రతి అంశం శాస్త్రీయమైనదేనని బలంగా చాటి చెప్పారు. మనం ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) ఓ కీలక పాత్రలో నటించారు.

హీరో నిఖిల్ విషయానికి వస్తే.. ‘కార్తికేయ 2’ విజయ పరంపరను కొనసాగిస్తూ.. ఇటీవల ఆయన నటించిన ‘18 పేజెస్’ (18 Pages) చిత్రం.. రొమాంటిక్ డ్రామాగా మంచి విజయం సాధించింది. ఇందులో కూడా అనుపమ పరమేశ్వరనే హీరోయిన్‌గా నటించింది. నిఖిల్ ప్రస్తుతం తన తదుపరి పాన్ ఇండియా చిత్రం ‘SPY’తో సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతుంది. త్వరలోనే ‘కార్తికేయ 3’ (Karthikeya 3) చిత్రం కూడా ఉంటుందనేలా ఇటీవలే దర్శకుడు చందూ మొండేటి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

*********************************

* Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

*Young Tiger NTR: విశ్వక్ సేన్ దర్శకత్వం మానేయాలని కోరుకుంటున్నా..

*Jr NTR: ఆస్కార్ క్రెడిట్ ఎవరిదంటే.. ఎన్టీఆర్ స్పీచ్ వైరల్

*Bigg Boss Himaja: ఘోరంగా ఏడ్చాను.. కానీ?

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-20T16:56:48+05:30 IST