Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

ABN , First Publish Date - 2023-03-18T14:02:30+05:30 IST

సింగర్ సునీత (Singer Sunitha) అనగానే ఈ మధ్య అంతా ఏదేదో ఊహించేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆమె ప్రెగ్నెంట్ అంటూ రకరకాలుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. అలా వార్తలను క్రియేట్ చేసే వారందరికీ

Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది
Singer Sunitha

సింగర్ సునీత (Singer Sunitha) అనగానే ఈ మధ్య అంతా ఏదేదో ఊహించేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆమె ప్రెగ్నెంట్ అంటూ రకరకాలుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. అలా వార్తలను క్రియేట్ చేసే వారందరికీ రీసెంట్‌గానే ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ కౌంటర్ వేశారు. ‘‘నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఆ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు’’ అంటూ సునీత (Sunitha) ఇచ్చిన కౌంటర్‌తో.. అప్పటి నుంచి రూమర్స్ అన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం సునీత హాయిగా తన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేసుకుంటూనే ఉంటుంది. తాజాగా ఆమె క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Director Krishna Vamsi) తెరకెక్కించిన ‘రంగమార్తాండ’ (Rangamarthanda) చిత్రాన్ని చూసి.. వెంటనే ఓ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో..

‘‘ఇప్పుడే రంగమార్తాండ సినిమా చూశాను. ఈ వీడియో చేయకుండా ఉండలేకపోతున్నాను. ఒక సినిమాలో.. మూడు పాత్రలు (ప్రకాశ్ రాజ్‌గారు, బ్రహ్మానందంగారు, రమ్యకృష్ణగారు) (Prakash Raj, Brahmanandam, Ramyakrishna) ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి అంటే.. వాళ్ల అభినయంతో మనసంతా బరువైపోయింది. చాలా గుబులుగా అనిపిస్తుంది. మీకు తెలుసా.. ఇటువంటివి నిత్యం ఉంటే మాత్రం.. బయట పడటానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటాం. కానీ నా పరిస్థితి ఏంటో తెలుసా? ఆ బరువు చాలా బాగుంది. మనసు గుబులుగా ఉంటూనే.. అందులోనే ఉండాలనిపిస్తుంది. అలాగే ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. అంత గొప్ప నటనను కృష్ణవంశీగారు రాబట్టడం అనేది.. ఓ మై గాడ్.. ఆయనకే సాధ్యమైంది.. హ్యాట్సాఫ్. ‘రంగమార్తాండ’ తప్పకుండా చూడాల్సినటువంటి సినిమా. నేను గట్టిగా రికమెండ్ చేస్తున్నాను. దయచేసి వెళ్లి చూడండి. మీ హృదయాలను కదిలించే సన్నివేశాలు ఇందులో ఎన్నో ఉన్నాయని నేను చెప్పగలను. చాలా రిలేటబుల్ స్టోరీ.. ’’ అంటూ ‘రంగమార్తాండ’ సినిమాపై తన మనసులోని భావాల్ని సునీత పంచుకున్నారు. ప్రస్తుతం సింగర్ సునీత షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Singer Sunitha about Rangamarthanda)

రీసెంట్‌గా ఇండస్ట్రీలోని మహిళలకు ‘రంగమార్తాండ’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. షో అనంతరం అందరూ దాదాపు సింగర్ సునీత ఇచ్చిన, చెప్పిన ఎక్స్‌ప్రెషన్‌నే వెలిబుచ్చారు. వారే కాదు.. ఇప్పటి వరకు ఈ సినిమాని చాలా మందికి కృష్ణవంశీ చూయించారు.. చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగంగా రియాక్ట్ అవుతున్నారు. కాగా.. ‘రంగమార్తాండ’ చిత్రం ఈ నెల 22న ఉగాది (Ugadi) స్పెషల్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

*Young Tiger NTR: విశ్వక్ సేన్ దర్శకత్వం మానేయాలని కోరుకుంటున్నా..

*Jr NTR: ఆస్కార్ క్రెడిట్ ఎవరిదంటే.. ఎన్టీఆర్ స్పీచ్ వైరల్

*Bigg Boss Himaja: ఘోరంగా ఏడ్చాను.. కానీ?

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-18T14:02:32+05:30 IST