NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-03-21T22:10:19+05:30 IST

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్

NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్
NBK 108

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ #NBK108. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది (Sahu Garapati and Harish Peddi) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ శ్రీలీల (Sreeleela) కీలకమైన పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే శ్రీలీల ఈ చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయింది. తాజాగా ఏజ్ లెస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుందని మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. అంతేకాదు.. ఆమె కూడా షూటింగ్‌లో జాయిన్ అయినట్లుగా తెలిపారు. బాలకృష్ణతో కాజల్ నటిస్తున్న మొదటి చిత్రం NBK108 కావడం విశేషం. బాలకృష్ణ, కాజల్ ఒకరిని నొకరు పిడికిలితో షేక్ హ్యాండ్స్ ఇస్తున్నట్లుగా కనిపిస్తున్న ఫోటోని మేకర్స్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రం షూటింగ్ సంబంధించి ఓ వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. (NBK108 leaked Video)

ఈ వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం.. హైదరాబాద్ BHELలో వేసిన కూరగాయల మార్కెట్ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. బాలయ్య, కాజల్‌ అగర్వాల్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సెట్‌కి సంబంధించి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. NBK108లో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ మొత్తం కలగలిపి.. అన్ని రకాల ఆడియన్స్‌ని మెప్పించేలా ఈ సినిమా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సినిమాకు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. బాలకృష్ణ గత రెండు సినిమాలకు సంగీతం అందించిన ఎస్ థమన్ మరోసారి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ (S Thaman)ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ షైన్ స్క్రీన్స్ (Shine Screens) నిర్మిస్తున్న ఈ చిత్రం చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా.. సి రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమ్మిరాజు ఎడిటర్‌‌గా, రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌‌గా పని చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Brahmanandam: వన్ మోర్ అన్నావంటే కృష్ణవంశీని చంపేస్తానన్నాడు

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

*Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్

* Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-21T22:10:21+05:30 IST