Raashi Khanna: షారూఖ్ ఖాన్‌ను అధిగమించి తొలిస్థానం కైవసం

ABN , First Publish Date - 2023-03-31T20:46:56+05:30 IST

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో నటిస్తన్న అందాల భామ రాశీ ఖన్నా (Raashi Khanna). రుద్ర (Rudra) వెబ్‌సిరీస్‌లో నెగెటివ్ రోల్ పోషించి ప్రేక్షకులను అలరించింది. ఈ మధ్యనే ‘ఫర్జీ’ (Farzi) తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Raashi Khanna: షారూఖ్ ఖాన్‌ను అధిగమించి తొలిస్థానం కైవసం

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో నటిస్తన్న అందాల భామ రాశీ ఖన్నా (Raashi Khanna). రుద్ర (Rudra) వెబ్‌సిరీస్‌లో నెగెటివ్ రోల్ పోషించి ప్రేక్షకులను అలరించింది. ఈ మధ్యనే ‘ఫర్జీ’ (Farzi) తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ షో ప్రేక్షకుల నుంచి అమితమైన ఆదరణను దక్కించుకుంది. ఫలితంగా రాశీకి దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రచురించే పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో రాశీ ఖన్నా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ను వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని ఆమె కైవసం చేసుకుంది. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆమె మాట్లాడింది.

‘‘ఐఎండీబీ లిస్ట్‌లో తొలిస్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలియగానే ఎంతో సంతోషమేసింది. మా నాన్నకు ఫోన్ చేసి ఈ ఆనందాన్ని పంచుకున్నా. ఆయనకు ఐఎండీబీ గురించి ఏం తెలియదు. కానీ, నేను షారుఖ్ ఖాన్‌ను కంటే మొదటి స్థానంలో ఉన్నానని చెప్పగానే ఆయన షాక్‌‌కు గురయ్యారు. ఈ విషయాన్ని నేను కూడా నమ్మలేదు. నిజమో కాదో తెలుసుకోవడానికి కొంచెం సమయం పట్టింది. నా జీవితంలో ఓ మైలు రాయిగా ఈ అంశాన్ని భావిస్తాను. కింగ్ ఖాన్‌ను ఏ విషయంలోనూ ఎవరూ ఓడించలేరు. నేను ఆయనను అధిగమించి తొలిస్థానాన్ని దక్కించుకున్నానంటే అది కేవలం నేను నటించిన పాత్రకు దక్కిన ఆదరణ మాత్రమే. ‘ఫర్జీ’ లో నా పాత్రను ప్రజలు బాగా ఇష్టపడ్డారు’’ అని రాశీ ఖన్నా చెప్పింది.

ఫర్జీ వెబ్‌సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. ఇండియాలో ఎక్కువ మంది వీక్షించిన సిరీస్‌గా ‘ఫర్జీ’ రికార్డు నెలకొల్పింది. దాదాపుగా 3.7కోట్ల మంది షోను వీక్షించారని అంచనా.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Manisha Koirala: రజినీ కాంత్‌తో చేసిన సినిమా వల్లే కెరీర్ ఖతం

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Updated Date - 2023-03-31T20:48:44+05:30 IST