Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

ABN , First Publish Date - 2023-03-30T15:24:49+05:30 IST

బాలీవుడ్‌లోని టాప్ ప్రొడ్యూసర్స్‌లో కరణ్ జోహార్ (Karan Johar) ఒకరు. ధర్మ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఈ బ్యానర్‌పై సినిమాలను కూడా నిర్మిస్తుంటారు. బాలీవుడ్‌కు అనేక మంది స్టార్ కిడ్స్‌ను పరిచయం చేసింది ఆయనే.

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..
Koffee With Karan

బాలీవుడ్‌లోని టాప్ ప్రొడ్యూసర్స్‌లో కరణ్ జోహార్ (Karan Johar) ఒకరు. ధర్మ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఈ బ్యానర్‌పై సినిమాలను కూడా నిర్మిస్తుంటారు. బాలీవుడ్‌కు అనేక మంది స్టార్ కిడ్స్‌ను పరిచయం చేసింది ఆయనే. కరణ్ హోస్ట్ చేస్తున్న చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan). ఈ షో ఏడు సీజన్‌లు ప్రసారమయి ప్రేక్షకులను అలరించింది. ఫలితంగా కరణ్ జోహార్ 8వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+హాట్ స్టార్‌’ (Disney+Hotstar) లో ఈ చాట్ షో స్ట్రీమింగ్ కానుంది. ‘కాఫీ విత్ కరణ్-8’ కు సంబంధించిన ఓ అప్‌డేట్ బాలీవుడ్ మీడియాలో విపరీతంగా షికార్లు కొడుతుంది. అదేంటంటే..

Allu-Arjun.jpg

‘కాఫీ విత్ కరణ్-8’ చాట్ షోకు బాలీవుడ్ తారలతో సహా అనేక మంది సౌత్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్టు సమాచారం అందుతుంది. ఈ షో ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. కరణ్ జోహార్ ఈ సారి చాట్ షోకు అల్లు అర్జున్ (Allu Arjun), యశ్ (Yash), రిషబ్ శెట్టి (Rishab Shetty)లతో సహా వారి భాగస్వాములను ఆహ్వానించనున్నారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్త బయటికి రావడంతోనే నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. కరణ్ జహార్ ప్రశ్నలతో ఇబ్బంది పెడతారు బుక్ చేస్తాడేమో చూసుకోండి అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) కూడా షోకు రానున్నారని తెలుస్తోంది. కింగ్ ఖాన్‌తోనే ‘కాఫీ విత్ కరణ్-8’ సీజన్ ప్రారంభం కానుంది. ఎనిమిదో సీజన్‌లో అనేక కొత్త కేటగిరిలను ప్రవేశపెట్టనున్నారట.

yash.jpg

కరణ్ జోహార్ ప్రస్తుతం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani) ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్, ధర్మేంద్ర, జయా బచ్చన్, షబనా అజ్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 28న విడుదల కానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-30T15:32:49+05:30 IST