Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

ABN , First Publish Date - 2023-03-25T15:46:25+05:30 IST

ఇండియాలో లాక్‌డౌన్ విధించిన అనంతరం ప్రజల అభిరుచుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఓటీటీలకు ఆదరణ పెరిగింది. ప్రజలు వెబ్ సిరీస్‌లను చూడటానికి ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ సంస్థ మోస్ట్ వాచ్‌డ్ వెబ్ సిరీస్ లిస్ట్‌ను విడుదల చేసింది.

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

ఇండియాలో లాక్‌డౌన్ విధించిన అనంతరం ప్రజల అభిరుచుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఓటీటీలకు ఆదరణ పెరిగింది. ప్రజలు వెబ్ సిరీస్‌లను చూడటానికి ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ సంస్థ మోస్ట్ వాచ్‌డ్ వెబ్ సిరీస్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో షాహిద్ కపూర్ (Shahid Kapoor), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన ‘ఫర్జీ’ (Farzi) అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా రికార్డు సృష్టించింది. ఈ షోను దాదాపుగా 3.7కోట్ల మంది వీక్షించారు.

ఇప్పటి వరకు అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సిరీస్‌గా రికార్డు ‘రుద్ర’ (Rudra) పేరిట ఉండేది. ఈ షోను 3.52కోట్ల మంది వీక్షించారు. ఈ సిరీస్‌లో అజయ్ దేవగణ్ (Ajay Devgn) కీలక పాత్ర పోషించారు. డిస్నీ+హాట్‌స్టార్‌లో ‘రుద్ర’ అందుబాటులో ఉంది. ‘మిర్జాపూర్’ (Mirzapur 2) సీజన్ 2ను 3.25కోట్ల మంది, ‘పంచాయత్ 2’ (Panchayat 2) ను 2.96కోట్ల మంది, ‘క్రిమినల్ జస్టిస్’ (Criminal Justice) ను 2.91కోట్ల మంది, ‘ది నైట్ మేనేజర్’ (The Night Manager) ను ఇప్పటి వరకు 2.72కోట్ల మంది చూశారు.

Rudra.jpg

వీక్షకుల సంఖ్యను లెక్కించడానికి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఒక ఎపిసోడ్‌ను పూర్తిగా వీక్షించిన లేదా ఏ షోను అయినా 30 నిమిషాల పాటు చూసినా ఒక్క వీక్షణగా పరిగణించారు. రిపీట్ వీక్షణలను పరిగణనలోకి తీసుకోలేదు.

‘ఫర్జీ’ వెబ్‌సిరీస్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి నుంచి అందుబాటులో ఉంది. ఈ షోలో రాశీ ఖన్నా, కేకే. మీనన్, రెజీనా కాసాండ్రా, జాకీర్ హుస్సేన్, భువన్ అరోరా, అమోల్ పాలేకర్, కుబ్రసైత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ మేకర్స్ రాజ్ అండ్ డీకే ‘ఫర్జీ’ కి దర్శకత్వం వహించారు. ఈ షోకు అభిమానులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-25T15:47:32+05:30 IST