Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

ABN , First Publish Date - 2023-03-19T16:26:09+05:30 IST

హిట్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా కొత్త రకం పాత్రలను చేసే నటుడు సూర్య (Suriya). కోలీవుడ్‌లో ఆయనకు సూపర్ స్టార్‌డమ్ ఉంది. ‘శివ పుత్రుడు’, ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

హిట్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా కొత్త రకం పాత్రలను చేసే నటుడు సూర్య (Suriya). కోలీవుడ్‌లో ఆయనకు సూపర్ స్టార్‌డమ్ ఉంది. ‘శివ పుత్రుడు’, ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజాగా సూర్యకు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే..

సూర్యకు దియా (Diya), దేవ్ (Dev) అనే ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే. దియా ఉన్నత చదువుల నిమిత్తం సూర్య దంపతులు ముంబైకి మకాన్ని మార్చబోతున్నట్టు తెలుస్తోంది. అందు కోసం సూర్య దంపతులు ఇప్పటికే ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారట. ఈ ప్లాట్‌ కోసం దాదాపుగా రూ.70కోట్లను చెల్లించారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ అపార్ట్‌మెంట్ గెటేడ్ కమ్యూనిటీలో 9వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని సమాచారం. దియా చదువు పూర్తయిన అనంతరం సూర్య కుటుంబ సభ్యులు ఈ ఫ్లాట్‌ను అతిథి గృహాంలా వినియోగించనున్నారని తెలుస్తోంది. ముంబై ఎయిర్‌పోర్టులో కొంత పార్కింగ్ స్థలాన్ని కూడా సూర్య కాంట్రాక్ట్‌కు తీసుకున్నారు. ఈ నగరంలోనే కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. ప్రస్తుతం ‘ఆకాశం నీ హద్దురా’ హిందీ రీమేక్‌ను ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరికొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే ఆలోచనలో ఉన్నారు.

సూర్య ప్రస్తుతం సిరుతై శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘సూర్య 42’ (Suriya 42) అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. దిశా పటానీ (Disha Patani) హీరోయిన్ పాత్రను చేస్తున్నారు. అనంతరం వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’ (Vaadivaasal) ను పట్టాలెక్కించనున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..

NTR 30: తుఫాను హెచ్చరిక.. పండగ లాంటి వార్త వచ్చేసింది..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Updated Date - 2023-03-19T16:26:13+05:30 IST