Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

ABN , First Publish Date - 2023-03-25T16:23:46+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde). అంచెలంచెలుగా ఎదుగతూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయ్యారు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేశారు.

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde). అంచెలంచెలుగా ఎదుగతూ స్టార్ హీరోయిన్‌గా మారిపోయ్యారు. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేశారు. ఈ అందాల భామ లక్కీ చాన్స్ కొట్టేశారు. స్టార్ హీరోతో మరోసారి సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.

Pooja.jpg

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ‘బజరంగీ భాయిజాన్’ (Bajrangi Bhaijaan). కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా వ్యవహరించారు. ఈ చిత్రం 2015లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సల్మాన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ‘పవన్ పుత్ర’ (Pavan Putra) టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. కరీనా కపూర్‌కు బదులుగా ఆమె నటించనుందని సమాచారం అందుతుంది. తాజాగా సల్మాన్, పూజా హెగ్డే కలసి ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) లో నటించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే నటనకు సల్మాన్ ఫిదా అయ్యారట. అందు వల్ల పవన్ పుత్ర‌లో ఆమెకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ కు ఫర్హద్ సామ్జీ దర్శకత్వం వహించారు. జగపతి బాబు, వెంకటేశ్, షెహనాజ్ గిల్, భూమిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం రంజాన్ కానకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూజా హెగ్డే ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి త్రి విక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-25T16:54:43+05:30 IST