SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

ABN , First Publish Date - 2023-03-26T20:46:28+05:30 IST

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ‘నాటు నాటు’ (Naatu Naatu) అకాడమీ అవార్డును అందుకుంది.

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ‘నాటు నాటు’ (Naatu Naatu) అకాడమీ అవార్డును అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఆస్కార్ కోసం ఎస్‌ఎస్. రాజమౌళి రూ.80కోట్లకు పైగా ఖర్చు చేశారని రూమర్స్ హల్‌చల్ చేశాయి. అకాడమీ టిక్కెట్‌ కొసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలన్నింటినిపై ‘ఆర్ఆర్ఆర్’ లైన్ ప్రొడ్యూసర్ ఎస్‌ఎస్‌.కార్తికేయ (SS. Karthikeya) స్పష్టతనిచ్చారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ అనేది థియేటర్స్ కోసం రూపొందించిన సినిమా. కొంత మంది విదేశీయుల నుంచి సినిమాకు మంచి స్పందన వచ్చింది. అందువల్ల అమెరికన్ ఆడియన్స్ కోసం ఇంగ్లీష్‌ వెర్షన్‌లో ఒక్క శుక్రవారం విడుదల చేయాలనుకున్నాం. థియేటర్స్ వివరాలు సేకరించి 60స్క్రీన్స్‌లో జూన్ 1న రిలీజ్ చేద్దామనుకున్నాం. అంతకు ఐదు రోజుల ముందే మే 25నుంచి మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ మొదలైంది. ఒకరోజు అనుకుని సినిమాను విడుదల చేస్తే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ఆ ఒకరోజు కాస్తా నెల అయింది. నాన్‌ ఇండియన్స్‌ సినిమాను బాగా ఆదరించారు. ఆ అభిమానులే #RRRForOscars ట్రెండ్‌ను మొదలుపెట్టారు. అప్పుడే ఆస్కార్ ఆలోచన వచ్చింది. సాధారణంగా ఇండియన్‌ సినిమాలంటే పాటలు, డ్యాన్స్‌లు ఉంటాయని హాలీవుడ్‌ ప్రేక్షకులు ఆలోచిస్తుంటారు. అయితే, ‘ఆర్‌ఆర్ఆర్‌’లో పాటలతో పాటు, అద్భుతమైన హీరోయిజం ఉంది. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత సినిమాలో మీకు ఏం నచ్చింది అని చాలా మంది అభిప్రాయాలు తీసుకునేవాళ్లం. ఎక్కువ మంది చరణ్‌ను తారక్‌ అన్న ఎత్తుకుని ఫైట్‌ చేసే సీన్‌ బాగా నచ్చిందని చెప్పారు. ఇండియా నుంచి అధికారికంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ కు ఆస్కార్‌ ఎంట్రీ లభించనప్పుడు కాస్త బాధగా అనిపించింది. అందువల్ల ఆస్కార్ కోసం సొంతంగా అప్లై చేయాలనుకున్నాం’’ అని కార్తికేయ చెప్పారు.

rrr.jpg

‘‘ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ram Charan), ప్రేమ్‌రక్షిత్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవలను ఆస్కార్‌ కమిటీ ఆహ్వానించింది. కీరవాణి బాబాయ్‌, చంద్రబోస్‌లు నామినేషన్‌లో ఉన్నారు. ఆస్కార్స్ టిక్కెట్స్ కోసం నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు ఆస్కార్‌ కమిటీకి మెయిల్‌ చేయాలి. ఆ టికెట్‌లలో కూడా వివిధ రకాల క్లాస్‌లు ఉంటాయి. మా ఫ్యామిలీ కోసం కీరవాణి బాబాయ్‌ ఆస్కార్‌ వాళ్లకు మెయిల్‌ పంపారు. వాళ్లు అన్నీ సరిచూసుకున్న తర్వాత మెయిల్‌కు రిప్లై ఇస్తూ లింక్‌ పార్వార్డ్ చేశారు. అలా మేము ఒక్కో టికెట్‌ 1500 డాలర్లు పెట్టి కొన్నాం. మరో నలుగురి కోసం 750 డాలర్లు పెట్టి కొన్నాం. బయట వస్తున్న వార్తలన్ని అవాస్తవం. డబ్బులు చెల్లించి ఆస్కార్‌‌ను కొనుకోవచ్చన్నది పెద్ద జోక్‌. ఆస్కార్స్‌కు చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆడియన్స్‌ ప్రేమను కొనగలమా..? సినిమా గురించి స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, జేమ్స్‌ కామెరూన్‌ చెప్పిన మాటలను కొనలేం కదా’’ అని కార్తికేయ పేర్కొన్నారు.

‘‘హాలీవుడ్ సినిమాకు అయితే బిగ్ స్టూడియోస్ ఖర్చు పెడతాయి. పబ్లిసిటీని చూసుకుంటాయి. ‘ఆర్ఆర్ఆర్’ కు అంత ఖర్చు చేసే స్టూడియో లేదు. క్యాంపెన్‌ కోసం మేము అనుకున్న బడ్జెట్‌ రూ.5 కోట్లు. దాన్ని మూడు దశల్లో ఖర్చు చేయాలనుకున్నాం. మొదటి ఫేజ్‌లో రూ.3 కోట్లు ఖర్చు చేశాం. నామినేషన్స్‌ వచ్చిన తర్వాత మరికొంత బడ్జెట్‌ పెంచాం. మొత్తం క్యాంపెన్‌‌ను ఐదారు కోట్లల్లో పూర్తి చేయాలనుకున్నాం. చివరకు రూ.8.5కోట్లు అయింది. న్యూయార్క్‌, లాస్‌ ఏంజెలెస్ వంటి ప్రాంతాల్లో మరిన్ని స్క్రీనింగ్స్‌ వేయాల్సి రాయడంతో బడ్జెట్ పెరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ కు మూడు పీఆర్ టీమ్స్ పని చేశాయి. అకాడమీ వోటర్స్‌కు సినిమాపై ఆసక్తి పెంచడంలో వీరు వ్యూహాత్మకంగా వ్యవహరించారు’’ అని కార్తికేయ తెలిపారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-26T20:50:16+05:30 IST