Manisha Koirala: రజినీ కాంత్‌తో చేసిన సినిమా వల్లే కెరీర్ ఖతం

ABN , First Publish Date - 2023-03-30T19:33:28+05:30 IST

నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా (Manisha Koirala) బాలీవుడ్‌తో పాటు దక్షిణాదికి చెందిన అనేక చిత్రాల్లో నటించారు. బాంబే (Bombay), ఇండియన్ (Indian) వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మనీషా కొయిరాలా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Manisha Koirala: రజినీ కాంత్‌తో చేసిన సినిమా వల్లే కెరీర్ ఖతం

నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా (Manisha Koirala) బాలీవుడ్‌తో పాటు దక్షిణాదికి చెందిన అనేక చిత్రాల్లో నటించారు. బాంబే (Bombay), ఇండియన్ (Indian) వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మనీషా కొయిరాలా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రజినీకాంత్ (Rajinikanth) తో చేసిన బాబా (Baba) సినిమా వల్లే దక్షిణాదిలో తన కెరీర్ ముగిసిపోయిందని తెలిపారు. ఆ మూవీ ప్రభావం తన కెరీర్‌పై చాలా ఉందని ఆమె చెప్పారు.

రజినీ కాంత్, మనీషా కొయిరాలా హీరో, హీరోయిన్‌గా నటించిన కోలీవుడ్ చిత్రం బాబా. 2009లో విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. బాబా మూవీ గురించి మనీషా కొయిరాలా తాజాగా మాట్లాడారు. ‘‘నా చివరి తమిళ చిత్రం బాబా. ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిచంలేదు. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఆ మూవీ ప్లాఫ్‌తో సౌత్ లో నా కెరీర్ ముగిసిపోయింది. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. 20 ఏళ్ల తర్వాత బాబాను రీ రిలీజ్ చేయగా మంచి ఆదరణ వచ్చింది. రజినీకాంత్ సినిమాలు ఎప్పుడు ప్లాఫ్ కావు. కానీ, బాబా మాత్రం డిజాస్టర్ అయింది. ఆయనతో పని చేయడం చాలా బాగుంటుంది’’ అని మనీషా కొయిరాలా తెలిపారు.

Baba.jpg

బాబా సినిమాకు రజినీకాంత్ రచయిత, స్క్రీన్ ప్లే రైటర్‌గా, నిర్మాతగా వ్యవహరించారు. సురేశ్ కృష్ణ తెరకెక్కించారు. సినిమా పరాజయం పాలవడంతో అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్‌కు రజినీ డబ్బులను కూడా వెనక్కి ఇచ్చారు. ఈ చిత్రంలో నాస్తికుడైన ప్రాతను పోషించారు. పూర్వ జన్మలో హిమాలయ సాధువు అయిన ఆయన పునర్జన్మలో నాస్తికుడైన యువకుడిగా జన్మిస్తారు. అనంతరం తాను పునర్జన్మ పొందినట్లుగా తెలుసుకుంటారు.

మనీసా కొయిరాల కెరీర్ విషయానికి వస్తే.. ‘షెహజాదా’ (Shehzada)లో కీలక పాత్ర పోషించారు. ‘అల వైకుంఠపురం’ కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న హీరామండి (Heeramandi) వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-10-27T14:49:08+05:30 IST