Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్

ABN , First Publish Date - 2023-03-29T18:22:36+05:30 IST

అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి హీరోగా మారిన వ్యక్తి నాని (Nani). సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగారు. అభిమానులందరు ముద్దుగా నేచురల్ స్టార్ అని పిలుస్తుంటారు.

Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్

అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి హీరోగా మారిన వ్యక్తి నాని (Nani). సినీ ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగారు. అభిమానులందరు ముద్దుగా నేచురల్ స్టార్ అని పిలుస్తుంటారు. నాని తాజాగా ‘దసరా’ (Dasara) లో నటించారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న విడుదల కానుంది. దసరా సినిమా ప్రమోషన్స్‌లో నాని ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఓ డైరెక్టర్ తన ఇగోను హర్ట్ చేశాడన్నారు.

Dasara-Film.jpg

నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ‘దసరా’ రూపొందింది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహించారు. మొదటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పటికీ శ్రీకాంత్ తన ఇగోను హర్ట్ చేశాడని నాని చెప్పారు. ‘‘దసరా మూవీ షూటింగ్‌ను అప్పుడే మొదలుపెట్టాం. మొదటి షాట్ చేశాక శ్రీకాంత్ వైపు చూశాను. షాట్‌ను ఓకే చేయలేదు. ఏడు నుంచి ఎనిమిది టేక్స్ చేశాక కూడా ఓకే అనలేదు. నేను 15ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అందరు నేచురల్ స్టార్ అని పిలుస్తుంటారు. ఫస్ట్ షాటే ఓకే అయిపోతుంది. ఈ డైరెక్టర్ ఏంటీ ఎంతకు ఓకే చేయడం లేదనిపించింది. షాట్ ఓకే చేయకపోవడంతో పాటు బ్రేక్ తీసుకుంటవా అన్న అని అడగడంతో నా ఇగో హర్ట్ అయింది. అప్పుడు నేను బ్రేక్ వద్దు శ్రీకాంత్ అని చెప్పాను. మరో రెండు, మూడు షాట్స్ చేసిన తర్వాత నేనే బ్రేక్ కావాలని అడిగాను. అప్పుడు శ్రీకాంత్ నా దగ్గరకు వచ్చి అన్న గొంతు నుంచి నువ్వు పూర్తిగా మాట్లాడకు.. పూర్తిగా అడుగులు వేయకు అని చెప్పారు. అన్ని పనులు సగం మాత్రమే చేయమన్నారు. అప్పుడు నేను చేస్తున్న తప్పేమిటో నాకు అర్థమైంది. శ్రీకాంత్ చెప్పినట్టు చేయగానే షాట్‌ ఓకే అయింది’’ అని నేచురల్ స్టార్ నాని తెలిపారు.

‘దసరా’ లో కీర్తి సురేశ్ (Keerthy Suresh) హీరోయిన్ పాత్రను పోషించారు. దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించారు. బొగ్గు గనుల నేపథ్యంలో వీర్లపల్లి అనే గ్రామం నేపథ్యంలో మూవీ తెరకెక్కింది. ఎస్‌‌ఎల్‌వీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని రూపొందించింది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టు గానే సినిమా నాని కెరీర్‌లోనే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-29T18:25:11+05:30 IST