OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2023-03-29T09:51:07+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ తరుణంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. చాలా సినిమాలు థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీ బాట పడుతున్నాయి.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ott

నెట్ వినియోగం పెరిగిన ఈ తరుణంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. చాలా సినిమాలు థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీ బాట పడుతున్నాయి. అంతేకాకుండా.. చాలా మంది సినీ లవర్స్ ఇంటి వద్దే ఉండి వినోదాన్ని పొందాలని అనుకుంటున్నారు. దాని వల్ల ఓటీటీలకి డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

అన్‌సీన్ (Unseen)

అన్‌సీన్ అనేది యోకో ఒకుమురా దర్శకత్వం వహించిన 2023 అమెరికన్ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఆమె దర్శకత్వం వహించిన మొదటి మూవీ ఇదే. ఈ సినిమాలో మిడోరి ఫ్రాన్సిస్, జోలీన్ పర్డీ, మిస్సి పైల్ కీలకపాత్రల్లో నటించారు. బ్లమ్‌హౌస్ టెలివిజన్ బ్యానర్‌పై జాసన్ బ్లమ్ ఈ మూవీని నిర్మించాడు. మార్చి 7న పారామౌంట్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేయగా.. పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది.

గ్యాస్ స్టేషన్ క్లర్క్ అయిన సామ్‌కు ఎమిలీ అనే యువతి నుంచి కాల్ వస్తుంది. ఎమిలీకి కళ్లు సరిగా కనిపించవు. అయితే.. ఆ కాల్ చేసే సమయంలో ఎమిలీని తన మాజీ ప్రియుడు చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతని నుంచి తప్పించుకుని అడవుల్లోకి వెళుతుంది. కాగా.. ఆమెని రక్షించడానికి సామ్ ఏం చేశాడనేది ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

unseen.jpg

బ్లడ్ (Blood)

జెస్ అనే నర్సు.. తన భర్త నుంచి విడాకులు తీసుకుంటుంది. అనంతరం టీనేజీ కుమార్తె టైలర్, ఎనిమిదేళ్ల కొడుకు ఒవెన్‌తో కలిసి తన కుటుంబానికి సంబంధించిన ఫామ్ హౌస్‌కి షిప్ట్ అవుతుంది. అప్పుడే వారు పెంపుడు కుక్క ఆ చుట్టూ పక్కల అడవిలో దేన్నో చూసి వెంటపడి వెళ్లిపోతుంది. కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చి.. యజమాని కుటుంబంపై భయంకరంగా దాడి చేస్తూ ఉంటుంది. ఆ కుక్కకి ఏమైంది.. దాన్ని క్యూర్ చేయడానికి జెస్ చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథాంశం. ఈ హార్రర్ చిత్రానికి బ్రాడ్ ఆండర్సన్ దర్శకత్వం వహించగా.. మిచెల్ మోనాఘన్, స్కీట్ ఉల్రిచ్ కీలకపాత్రల్లో నటించారు. జనవరి 27, 2023న థియేటర్‌లలో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

blood.jpg

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

Emergency: NYC - ఇంగ్లిష్

Wellmania - ఇంగ్లిష్

Mae Martin: SAP - ఇంగ్లిష్

యాపిల్ టీవీ ప్లస్ (Apple Tv Plus)

The Big Door Prize - ఇంగ్లిష్

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Leech - హిందీ

Chup - బెంగాలీ

Dudes - ఇంగ్లిష్

Blood - ఇంగ్లిష్

ఇవి కూడా చదవండి:

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Vivek Agnihotri: రాహుల్ గాంధీపై కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు అధికారికం మాత్రమేనంటూ..

Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు..

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Updated Date - 2023-03-29T09:51:55+05:30 IST