Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..

ABN , First Publish Date - 2023-03-26T14:45:01+05:30 IST

ఇటీవలికాలంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ (Nawazuddin Siddiqui) పేరు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..
Nawazuddin files defamation suit

ఇటీవలికాలంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ (Nawazuddin Siddiqui) పేరు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య ఆలియా (Aaliya) గొడవలే దీనికి ప్రధాన కారణం. తనని, తన కుమారుడిని ఇంట్లోకి రానివ్వట్లేదని నవాజుద్దీన్‌తో పాటు ఆయన కుటుంబంపై ఆలియా కేసు పెట్టింది. అనంతరం నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆయన సోదరుడు షమాస్ సిద్ధిఖీ (Shamas Siddiqui) కూడా పలు ఆరోపణలు చేశాడు. వీరిపై తాజాగా ఈ నటుడు పరువు నష్టం దావా వేశాడు.

రూ.100 కోట్ల నష్టపరిహారం కోసం వేసిన ఈ కేసు మార్చి 30న విచారణకు రానుంది. ఆ కేసులో తన దగ్గర మేనేజర్‌గా పని చేసిన తన సోదరుడు మోసం చేశాడని ఆరోపించాడు. సోదరుడు తన దగ్గర పని చేస్తున్న సమయంలో క్రెడిట్‌ కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్‌ పాస్‌వర్డ్‌లు తదితరాలు తీసుకున్నాడని నవాజ్ అందులో తెలిపాడు. అలాగే.. తన డబ్బుతో షామాస్‌ పలు ఆస్తులు కొన్నాడని, వాటిని షామాస్ పేరుతోనే కొన్నుకున్నాడని పేర్కొన్నాడు. ఆ ఆస్తుల్లో యారీ రోడ్‌లోని ఫ్లాట్, సెమీ కమర్షియల్ ప్రాపర్టీ, బుల్దానాలో ఒక స్థలం, షాపూర్‌లో ఒక ఫామ్‌హౌస్, దుబాయ్‌లో ఒక ఆస్తి, రేంజ్ రోవర్స్, బీఎమ్‌డబ్ల్యూలు, డుకాటి మొదలైన 14 వాహనాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. (Nawazuddin Siddiqui files 100 crore defamation suit)

అలాగే.. తన సోదరుడు షామాస్ తనపై తప్పుడు కేసులు పెట్టడానికి తన భార్య ఆలియాను సైతం ప్రేరేపించాడని కూడా నవాజ్ అందులో తెలిపాడు. అంతేకాకుండా తన భార్య ఇంతకుముందే వేరొకరిని వివాహం చేసుకుందని, కానీ తమ పెళ్లికి ముందు వరకూ తనను తాను అవివాహిత ముస్లింగా చెప్పుకుంటోందని, అలాగే..పిల్లల చదువుల కోసం ఇచ్చిన డబ్బులను సైతం దుర్వినియోగం చేసిందని నటుడు దావాలో ఆరోపించాడు.

ఇవి కూడా చదవండి:

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Updated Date - 2023-03-26T14:45:02+05:30 IST