Ravanasura: రవితేజ ‘రావణాసుర’ థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-03-25T18:00:00+05:30 IST

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం

Ravanasura: రవితేజ ‘రావణాసుర’ థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడంటే?
Ravi Teja in Ravanasura

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘రావణాసుర’ థియేట్రికల్ ట్రైలర్‌ (Ravanasura Theatrical Trailer)కి సమయం ఆసన్నమైంది. తాజాగా ‘రావణాసుర’ ట్రైలర్ విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ట్రైలర్‌ను మార్చి 28న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

ఇక ఈ పోస్టర్ మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా ఉంది. పోస్టర్‌లో రవితేజ (Ravi Teja) ఫెరోషియస్‌గా కనిపిస్తున్నారు. చేతులు పైకెత్తి ఒక చేతిలో తుపాకీతో ఇంటెన్స్‌గా కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో న్యాయ దేవత నీడ, కోర్టు గది తగలబడిపోవడం చూడవచ్చు. ఈ పోస్టర్ చూస్తుంటే రాబోయే ‘రావణాసుర’ ట్రైలర్‌ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో హైలీ ఇంటెన్స్ ఉంటుందనే అభిప్రాయాన్ని కలగజేస్తోంది. ట్రైలర్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే 28 వరకు వెయిట్ చేయక తప్పదు. (Ravanasura Trailer Release Details)

Ravi-Teja-pic.jpg

రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel), మేఘా ఆకాష్ (Megha Akash), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ (Sushanth) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures), ఆర్ టీ టీమ్‌వర్క్స్‌ (RT Teamworks)పై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న (Ravanasura Release Date) సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!

*Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*The Elephant Whisperers: వారి ఆనందానికి ఆస్కార్ అవార్డ్ ఏం సరిపోతుంది?

*Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-25T18:00:01+05:30 IST