Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

ABN , First Publish Date - 2023-03-23T16:33:15+05:30 IST

వెండితెరపై ఒక్కసారి కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) అలా కనిపిస్తే చాలు, స్టార్ నటీనటులకు ధీటుగా ఆయన సీన్స్‌కు రెస్పాన్స్ వస్తుంటుంది. ఆ విధంగా మొదటి నుంచి ప్రేక్షకులని తనదైన కామెడీ పాత్రలతో

Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?
Ram Charan, Brahmanandam and Chiranjeevi

వెండితెరపై ఒక్కసారి కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) అలా కనిపిస్తే చాలు, స్టార్ నటీనటులకు ధీటుగా ఆయన సీన్స్‌కు రెస్పాన్స్ వస్తుంటుంది. ఆ విధంగా మొదటి నుంచి ప్రేక్షకులని తనదైన కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకున్నారు బ్రహ్మానందం. హాస్యబ్రహ్మగా (HasyaBrahma) ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే తన కెరీర్‌లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో వచ్చిన ‘రంగమార్తాండ’ (Rangamarthanda) మూవీలో చక్రపాణి(Chakrapaani)గా ఒక సీరియస్ రోల్‌లో కనిపించారు బ్రహ్మానందం. ఉగాది (Ugadi) సందర్భంగా మార్చి 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన ‘రంగమార్తాండ’ చిత్రం.. మంచి మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ముఖ్యంగా సినిమా చూసిన వారంతా బ్రహ్మానందం పాత్రకు ముగ్ధులవుతున్నారు.

బ్రహ్మానందం పాత్రపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇన్నాళ్లూ కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం ఇలా ఏడిపించేశారు ఏంటి? అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారంటే.. చక్రపాణి పాత్రను కృష్ణవంశీ ఎలా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ప్రతీ ఒక్క ఆడియెన్ కంటతడి పెట్టేసుకుంటున్నారు. బ్రహ్మీ నటించిన పాత్రకు మంచి పేరు వస్తుండటంతో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) ఆయనని ప్రత్యేకంగా అభినందించారు.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star) ఇద్దరూ కలిసి.. బ్రహ్మానందంను శాలువాతో సత్కరించి.. తమ ప్రేమని తెలియజేశారు. వాస్తవానికి చిరంజీవి, బ్రహ్మానందంల మధ్య ఉన్న అనుబంధం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. బ్రహ్మానందం కెరీర్‌లో చిరంజీవి పాత్ర, స్థానం ఎటువంటిదో.. పలుమార్లు బ్రహ్మీనే పబ్లిక్‌గా తెలిపారు. ఇప్పుడు బ్రహ్మీ నటనకు ముగ్ధులై.. ఆయనని సన్మానించి ఇద్దరూ మరోసారి మెగా మనసు చాటుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మీని మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి శాలువాతో సత్కరిస్తున్న (Felicitation) పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Kantara 2: కీలక అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Brahmanandam: వన్ మోర్ అన్నావంటే కృష్ణవంశీని చంపేస్తానన్నాడు

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

*Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-23T16:33:16+05:30 IST