Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?

ABN , First Publish Date - 2023-03-24T14:06:04+05:30 IST

సీనియర్ నటీనటులు నరేష్, పవిత్రలు పెళ్లి (Naresh and Pavitra Marriage) చేసుకోబోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నరేష్ (VK Naresh) కూడా తన ట్విట్టర్ వేదికగా పవిత్రను పెళ్లాడుతున్న, ముద్దాడుతున్న

Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?
Naresh and Pavitra

సీనియర్ నటీనటులు నరేష్, పవిత్రలు పెళ్లి (Naresh and Pavitra Marriage) చేసుకోబోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నరేష్ (VK Naresh) కూడా తన ట్విట్టర్ వేదికగా పవిత్రను పెళ్లాడుతున్న, ముద్దాడుతున్న వీడియోలను షేర్ చేసి.. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చారు. నరేష్‌ ఒకవేళ పవిత్రను పెళ్లాడితే.. అతనికిది నాలుగో పెళ్లి అవుతుంది. ప్రస్తుతం మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) నుంచి విడాకులు తీసుకునేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నాడనేది అందరికీ తెలిసిన విషయమే.. కాబట్టి.. అన్ని సెట్ అయితే త్వరలోనే నరేష్ అధికారికంగా పవిత్రను పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వీడియోపై మాత్రం తాజాగా క్లారిటీ వచ్చేసింది.

ఈ పెళ్లి వీడియోకి సంబంధించిన అసలు కథ ఏమిటంటే.. ఎమ్.ఎస్. రాజు (MS Raju) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇది నిజమైన పెళ్లి కాదని.. నరేష్, పవిత్ర (Pavitra) కలిసి ఓ సినిమా చేస్తున్నారని.. ఆ సినిమాకు సంబంధించిన పెళ్లి వీడియో అని చిత్రజ్యోతి ఎప్పుడో ప్రకటించింది. ఇప్పుడు అఫీషియల్‌గా మేకర్సే ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి టైటిల్‌గా ‘మళ్లీ పెళ్లి’ (Malli Pelli) అని ఫిక్స్ చేశారు. ‘మత్తే మదువే’ (Matthe Maduve) పేరుతో కన్నడలోనూ ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. రెండు భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు నిర్మాత ఎవరో తెలుసా? మళ్లీ ఇక్కడా నరేష్ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే.. స్వయంగా నరేషే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ, దర్శకత్వం మాత్రం ఎమ్.ఎస్. రాజు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. నరేష్ కూడా ఈ రెండు భాషలకు సంబంధించిన పోస్టర్స్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్స్ తర్వాత అంతా.. ‘ఇదీ అసలు కథ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ పోస్టర్‌లో (Malli Pelli Poster) పవిత్ర సాంప్రదాయ రీతిలో ఇంటి ముందు ముగ్గేస్తుంటే.. ఆమెను మురిపెంగా చూస్తూ.. ముగ్గులోకి దింపేలా నరేష్ ఆమెను చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని ఈ వేసవికి విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్స్‌లో ప్రకటించారు. అయితే ఈ పోస్టర్స్‌లో వారిద్దరే కాకుండా.. ఇంకోకటి కూడా నెటిజన్లకు బాగా పని కల్పిస్తోంది. అదేంటంటే.. నరేష్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లుగా తెలుపుతూ.. ఆయనకు ఓ బిరుదును కూడా పోస్టర్‌లో వేశారు. ‘నవరసరాయ’ (NavarasaRaya) డాక్టర్ VK Naresh అని ఉన్న ఈ టైటిల్‌పై నెటిజన్లు.. ఇదెప్పుడిచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ బిరుదును నరేష్‌కు 2015లో ఇచ్చారు. మహానటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు (ANR) జయంతి సందర్భంగా శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో నరేష్‌ను అక్కినేని-శృతిలయ వెండి కిరీటంతో పాటు నవరసరాయ బిరుదుతో సత్కరించారు. అదీ విషయం.


ఇవి కూడా చదవండి:

*********************************

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-24T14:06:06+05:30 IST