scorecardresearch

రమేశ్ నటించిన ఏకైక తమిళ చిత్రం ‘శాంతి ఎనదు శాంతి’

ABN , First Publish Date - 2022-01-09T19:15:18+05:30 IST

ఘట్టమనేని రమేశ్ బాబు తన కెరీర్ లో మొత్తం 21 చిత్రాల్లో నటించగా.. వాటిలో ఒకే ఒక తమిళ చిత్రం ఉండడం విశేషం. సినిమా పేరు ‘శాంతి ఎనదు శాంతి’. టి.రాజేందర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1991లో విడుదలైంది. ఇందులో టీ. రాజేందర్ ప్రధాన పాత్ర పోషించగా.. రమేశ్ బాబు, రాధ జంటగా నటించారు. శింబు సినీ ఆర్ట్స్ పేరుతో రూపొందిన ఈ సినిమాలో రాజేందర్ తనయుడు శింబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు. ఇంకా నీతాపురి, వెన్నిరాడై మూర్తి, డిస్కో శాంతి, నాజర్, ఆలీ, వై.విజయ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

రమేశ్ నటించిన ఏకైక తమిళ చిత్రం ‘శాంతి ఎనదు శాంతి’

ఘట్టమనేని రమేశ్ బాబు తన కెరీర్ లో మొత్తం 21 చిత్రాల్లో నటించగా.. వాటిలో ఒకే ఒక తమిళ చిత్రం ఉండడం విశేషం. సినిమా పేరు ‘శాంతి ఎనదు శాంతి’. టి.రాజేందర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1991లో విడుదలైంది. ఇందులో టీ. రాజేందర్ ప్రధాన పాత్ర పోషించగా.. రమేశ్ బాబు, నీతాపురి జంటగా నటించారు. శింబు సినీ ఆర్ట్స్ పేరుతో రూపొందిన  ఈ సినిమాలో రాజేందర్ తనయుడు శింబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు. ఇంకా అతిథి పాత్రలో రాధ నటించారు. వెన్నిరాడై మూర్తి, డిస్కో శాంతి, నాజర్, ఆలీ, వై.విజయ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులో రమేశ్ బాబుకి ‘అచ్చమిల్లై’ గోపి డబ్బింగ్ చెప్పారు. అలాగే చక్రవర్తి పాత్రకి నాజర్ డబ్బింగ్ చెప్పారు.


అప్పట్లో ఇదే సినిమాను తెలుగులో ‘ప్రేమచరిత్ర’‌గా రాజేందర్ రీమేక్ చేయాలనుకున్నారు. అప్పట్లో ఈ సినిమా ప్రారంభోత్సవం మద్రాస్ బొటానికల్ గార్డెన్స్‌లో ఘనంగా జరుపుకుంది. శ్రీభారతి అనే అమ్మాయిని కూడా తెరకు పరిచయం చేస్తూ ప్రకటన కూడా ఇచ్చారు. సుధాలయ పిక్చర్స్ బ్యానర్ పై శాఖమూరి రాంబాబు, శాఖమూరి సూరి బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ ఎందుకనో సినిమా కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమాతో రాజేందర్ దర్శకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. 

Updated Date - 2022-01-09T19:15:18+05:30 IST