Rashmika: రశ్మిక మూవీలో నోరా, మలైకా
ABN , Publish Date - Aug 15 , 2025 | 06:44 PM
శ్రీవల్లి బీటౌన్ ను షేక్ చేస్తోంది. ఆల్రెడీ అక్కడ ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ముద్దుగుమ్మ ఇప్పుడు మరో సంచలనానికి వేదికగా మారుతుంది. బాలీవుడ్ లో భారీ బజ్ ఉన్న సినిమాలో నటిస్తూ మరో స్టెప్ ఎక్కబోతోంది అయితే అమ్మడికి ఇంకో అదృష్టం కలసి రానుంది.
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న (Rashmika) బాలీవుడ్‌లో ఫుల్ స్వాగ్‌తో రచ్చ చేస్తోంది. ప్రెజెంట్ అక్కడంతా అమ్మడి హవానే కనిపిస్తోంది. క్రేజీ ప్రాజెక్టులను చేతిలో పెట్టుకున్న ఈ చిన్నది .. ప్రస్తుతం తమా సినిమాలో నటిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana ) హీరోగా చేస్తున్నాడు. బీటౌన్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'స్త్రీ యూనివర్స్'లో భాగంగా వస్తున్న ఈ సినిమా చుట్టూ మంచి బజ్ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
రశ్మిక కీ రోల్ చేస్తుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందులో మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా పాలుపంచుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. బీ టౌన్ ఇంటర్నల్ సోర్స్ ప్రకారం ... ఈ చిత్రంలో మలైకా అరోరా (Malaika Arora ) నోరా ఫతేహి (Nora Fateh) స్పెషల్ డాన్స్ నంబర్లలో మెరవనున్నట్టుగా తెలుస్తోంది.
'తమా' సినిమాలో మలైకా, నోరా ఇద్దరూ రెండు ఎనర్జిటిక్ డాన్స్ నంబర్లలో కనిపించనున్నారట. మలైకాతో కొన్ని నెలల క్రితం హై-వోల్టేజ్ సాంగ్ షూట్ చేయగా.., నోరా ఈ వారంలో తన సాంగ్‌ని కంప్లీట్ చేసిందని తెలుస్తోంది. మలైకా సాంగ్ సినిమాలో కీలక సన్నివేశంలో వస్తుందని, నోరా సాంగ్ మూవీ ఎండ్‌లో ప్రమోషనల్ ట్రాక్‌గా ఉంటుందని అంటున్నారు.ఈ సినిమా ఈ దీపావళి సీజన్‌లో రిలీజ్ కానుంది.'తమా'లో రష్మిక క్యారెక్టర్ గురించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 'స్త్రీ యూనివర్స్' ఫ్యాన్స్‌కి ఈ మూవీ మరో బ్లాక్‌బస్టర్ ట్రీట్ ఇవ్వనుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే రశ్మిక నటించిన ‘పుష్ప ది రైజ్’ లో సమంత, ‘పుష్ప ది రూల్’ లో శ్రీలీల స్పెషల్ సాంగ్స్ తో ఊపేశారు. తమ గ్లామర్ తో పాన్ ఇండియాను షేక్ చేశారు బ్యూటీస్. ఇప్పుడు రశ్మిక నటిస్తున్న ‘తమా’ మూవీ లో ఈ హాట్ బ్యూటీలు చేస్తున్న పాటలు ట్రెండ్ అవుతుందని అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!
Read Also: Baahubali The Epic Teaser: బాహుబలి ది ఎపిక్ టీజర్ పై ఫ్యాన్స్ ఫైర్
Read Also: Kishkindhapuri Teaser: కిష్కింధపురి టీజర్ చూశారా.. ప్యాంట్ తడిచిపోవడమే