Tollywood Heroes: బాలీవుడ్ డైరెక్టర్స్ ను నమ్మడమే వీరు చేసిన తప్పా

ABN , Publish Date - Aug 15 , 2025 | 08:15 PM

ఒకప్పుడు టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ అంటే వేరు వేరు ఇండస్ట్రీలు. కానీ, ఇప్పుడు అలా కాదు. పాన్ ఇండియా అంటే అన్ని ఇండస్ట్రీలు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఈజీగా వస్తున్నారు.. వెళ్తున్నారు.

Tollywood

Tollywood Heroes: ఒకప్పుడు టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ అంటే వేరు వేరు ఇండస్ట్రీలు. కానీ, ఇప్పుడు అలా కాదు. పాన్ ఇండియా అంటే అన్ని ఇండస్ట్రీలు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఈజీగా వస్తున్నారు.. వెళ్తున్నారు. అయితే టాలీవుడ్ డైరెక్టర్స్ .. బాలీవుడ్ హీరోలకు ఎలాంటి హిట్స్ ఇస్తున్నారో.. బాలీవుడ్ డైరెక్టర్స్ టాలీవుడ్ హీరోలకు ఎలాంటి హిట్ ఇవ్వడం లేదు అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న చర్చ. మంచి మంచి కథలను ఎంచుకొని బాలీవుడ్ హీరోలు.. టాలీవుడ్ డైరెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో వారికి భారీ విజయాలను అందించారు.


కానీ, బాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం టాలీవుడ్ హీరోలకు భారీ డిజాస్టర్స్ ను అందిస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలకు బాలీవుడ్ డైరెక్టర్స్ భారీ పరాజయాన్ని అందించారు. మొదట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంగతికి వద్దాం. మెగాస్టార్ తనయుడుగా చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్ కు మగధీర సినిమా ఒక స్టార్ ను చేసింది. ఒక్క తెలుగులోనే కాదు హిందీలో కూడా రికార్డులు సృష్టించింది. దీంతో చరణ్ ను వెతుక్కుంటూ బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లఖియా వచ్చాడు. జంజీర్ అంతో పవర్ ఫుల్ పోలీస్ కథతో చరణ్ ను బాలీవుడ్ కు పరిచయం చేశాడు. మొదటిసారి పోలీస్ లుక్ లో చరణ్ అద్భుతంగా కనిపించడంతో.. డైరెక్టర్ ను విపరీతంగా నమ్మేశాడు. అసలు జంజీర్ అదరగొడుతుంది అనుకున్నారు. కానీ, ఆ నమ్మకం ఒక్కసారిగా వమ్ముగా మిగిలింది. చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ డిజాస్టర్ గా జంజీర్ నిలిచింది. ముంబై మీడియా మొత్తం చరణ్ ను ట్రోల్ చేసింది. ఆ దెబ్బతో చరణ్ బాలీవుడ్ ముఖం చూడడమే మానేశాడు.


చరణ్ తరువాత స్టార్ హీరోల్లో నెంబర్ వన్ అయిన ప్రభాస్ ఆదిపురుష్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలి తరువాత పాన్ ఇండియా అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు ప్రభాస్. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా మారిన డార్లింగ్ కు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అది కూడా రాముడిగా చేయడానికి అవకాశం వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆ సినిమా ఎంతటి వివాదాలకు గురైందో అందరికీ తెల్సిందే . అసలు ప్రభాస్ .. రాముడిలా ఉన్నాడా.. ? అన్న దగ్గరనుంచి ఈయన రాముడేంటి అనేంతవరకు కూడా బాలీవుడ్ మీడియా ప్రభాస్ ను ట్రోల్ చేసినంతగా ఇంకెవరు చేయలేదు. రిలీజ్ అయ్యాక కూడా వదిలిందా అంటే అది లేదు. రామాయణం కథ.. రాముడిగా బాగా చూపిస్తాడు అని ఓం రౌత్ ను నమ్మడమే ప్రభాస్ చేసిన తప్పా.. ? ఈ దెబ్బ తర్వాత ప్రభాస్ మళ్లీ బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు.


చరణ్, ప్రభాస్ తరువాత ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. దేవర తరువాత ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 14 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. వార్ 2 తో బాలీవుడ్ లో ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తాడు అనుకున్నారు. కానీ, అక్కడ అలా జరగలేదు. వార్ లాంటి సినిమా చూసాక.. ఎన్టీఆర్ అయాన్ ను పూర్తిగా నమ్మాడు. హృతిక్ తో మల్టీస్టారర్ అంటే.. బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోతోంది అనుకున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ తోనే కాలర్ ఎగరేసి మరీ చెప్పాడు. కానీ, చివరకు ఎన్టీఆర్ పాత్ర తేలిపోయిందని ఫ్యాన్స్ పెదవి విరిచారు. కలక్షన్స్ పరంగా కూడా వార్ 2 అంతంతమాత్రంగానే ఉన్నాయని టాక్ నడుస్తోంది. అలా ఈ ముగ్గురు హీరోలకు బాలీవుడ్ కు సెట్ అవ్వలేదు. దీనికి హీరోలు.. డైరెక్టర్లను గుడ్డిగా నమ్మడమేనా .. లేక ఫ్యాన్స్ ఏది చేసినా చూస్తారులే అనే ధైర్యమా అనేది తెలియాల్సి ఉంది.

Rajnikanth: రజనీ తొలి సినిమా 'అపూర్వ రాగంగళ్'కు 50 ఏళ్ళు...

Kasthuri Shankar: బీజేపీలో చేరిన కాంట్రవర్సీ క్వీన్

Updated Date - Aug 15 , 2025 | 08:15 PM