Baahubali The Epic Teaser: బాహుబలి ది ఎపిక్ టీజర్ పై ఫ్యాన్స్ ఫైర్
ABN , Publish Date - Aug 15 , 2025 | 06:35 PM
సినిమాపై చిన్న కమ్యూనికేషన్ గ్యాప్.. సోషల్ మీడియాని చిందర,వందర చేసింది. ఫ్యాన్స్ కి వచ్చిన కోపానికి ఆ సినిమా మేకర్స్ దిగి రావాల్సి వచ్చింది. అసలు విషయాన్ని చెప్పి వారిని కూల్ చేసేందుకు మేకర్స్ నానా తంటాలు పడ్డారు. ఇదంతా రాజమౌళి మేగ్నమ్ ఒపస్ 'బాహుబలి' రెండు భాగాలను ఒకటి చేసిన చిత్రం గురించి.
'బాహుబలి' (Baahubali) మ్యాజిక్ మళ్ళీ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది. ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) తన ఐకానిక్ 'బాహుబలి సిరీస్'ని కొత్త రూపంలో తీసుకొస్తున్నారు. బాహుబలి: ది ఎపిక్ ( Baahubali The Epic ) పేరుతో రెండు చిత్రాలను కలిపి స్పెషల్ రీకట్ వెర్షన్‌గా 2025 అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు. దీంతో అభిమానుల్లో జోష్ నింపేందుకు కూలీ (Coolie ) , వార్ 2 (War 2) సినిమాలతో పాటు థియేటర్లలో టీజర్ వస్తుందని ఆశపడ్డ వారికి ఒక్కసారిగా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్.
ముందు చెప్పినట్టుగా టీజర్ ఇండియాలో రిలీజ్ కాలేదు.. అమెరికా, కొన్ని ఓవర్సీస్ మార్కెట్లలో మాత్రమే స్క్రీన్ అయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు బాగా డిసప్పాయింట్ అయ్యారు. సోషల్ మీడియాలో 'బాహుబలి ది ఎపిక్' హ్యాష్‌ట్యాగ్‌తో ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. ఇది కాస్తా ఊహించని విధంగా ట్రెండ్ అవడంతో నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేస్తూ అసలు విషయాన్ని వారికి వివరించారు.
అమెరికా థియేటర్లలో రిలీజ్ అయిన టీజర్ ను కేవలం నాన్-ఇండియన్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి మాత్రమే కట్ చేశామని క్లారిటీ ఇచ్చారు. అందుకే టెక్స్ట్ సూపర్స్ అలా డిజైన్ చేశామని తెలిపారు. ఇక ఇండియన్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ టీజర్ వచ్చే వారం ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నామని... కాస్త వెయిట్ చేయాలంటూ కోరారు. దీంతో అభిమానులు శాంతించారు. కాగా ఈ స్పెషల్ రీకట్ వెర్షన్‌లో కొత్త సీన్స్ లేదా ఎడిటింగ్ ట్విస్ట్‌లు ఉంటాయని టాక్. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Read Also: Kishkindhapuri Teaser: కిష్కింధపురి టీజర్ చూశారా.. ప్యాంట్ తడిచిపోవడమే
Read Also: Mrunal Thakur: అప్పుడేదో చిన్నపిల్లని.. ఆ వీడియోపై క్లారిటీ ఇచ్చిన మృణాల్