Balu Gadi Love story: 'బాలుగాడి లవ్ స్టోరీ' అదే ట్విస్ట్
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:37 PM
ఆకుల అఖిల్, దర్శిక మీనన్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బాలుగాడి లవ్ స్టోరీ'. ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రానికి యల్. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
ఆకుల అఖిల్, దర్శిక మీనన్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బాలుగాడి లవ్ స్టోరీ'(balu gadi love story). ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రానికి యల్. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 8న విడుదల కాబోతోంది. ఈ సినిమాను 'సిల్వర్ స్క్రీన్' గణేష్ భారీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
నిర్మాత ఆకుల భాస్కర్ మాట్లాడుతూ 'నిజ జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు ఎల్.శ్రీనివాస్ తేజ్ గారు. ఘన శ్యామ్ గారు ఈ సినిమా కోసం సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు, హీరో హీరోయిన్ అఖిల్, దర్శిక మీనన్ చాలా చక్కగా నటించారు, ఆగస్ట్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలుగాడి లవ్ స్టొరీ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు.
దర్శకుడు ఎల్.శ్రీనివాస్ తేజ్ మాట్లాడుతూ 'మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన స్పూర్తి తోనే సినిమాను డైరెక్ట్ చేశాను, ఈ సినిమాలో కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరూ నటీనటులు చాలా అనుభవం కలిగిన వారిగా బాగా చేశారు' అన్నారు.
ALSO READ: Mass Jathara: ఏదేమైనా.. ధమాకాలో ఉన్నంత దమ్ము.. ఇందులో లేదురా
Hrithik Roshan: ఆ ఫలితం నాకు తెలిసింది.. మీరూ ట్రై చేయండి..
NTR Cover Page: ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్‌పై ఎన్టీఆర్
Director SJ shiva: నిర్మాతల డబ్బు విరాళంగా మారుతోంది