సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'మాయలేడీ' నుంచి హార్ట్ టచింగ్ 'చీకటో వైపున' లిరికల్ సాంగ్ విడుదల

ABN, Publish Date - Oct 08 , 2026 | 04:14 PM

రాజేశ్ వర్రే, మధుమిత సర్కార్ జంటగా నటిస్తున్న 'మాయలేడీ' నుంచి 'చీకటో వైపున' లిరికల్ సాంగ్ విడుదలైంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ పాట గాయపడిన ప్రేమికుడి బాధను హార్ట్ టచింగ్‌గా ఆవిష్కరిస్తోంది.

హీరో కమ్ ప్రొడ్యూసర్ రాజేశ్‌ వర్రే తాజా చిత్రం 'మాయలేడీ'. ఈ టైటిల్‌ రోల్‌ను మధుమిత సర్కార్‌ చేస్తోంది. రాకేశ్‌, మధుమిత జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రశంకర్ తెరకెక్కిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి 'చీకటో వైపున...' అనే లిరికల్ సాంగ్‌ విడుదలైంది. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ట్యూన్ కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. సింగర్ యాజిన్ నిజార్, సింధూరి విశాల్ దీనిని పాడారు. 'చీకటో వైపున, వేకువో వైపున తేల్చలేని యదే శూన్యమా, మౌనమే నేరమా, ఊహలే శూన్యమా, జాలిలేని విధే కాలమా, ఆశలే క్షణాలలోనే వీడిపోయెనా, కాలమే గతాలలోనే ఆగిపోయెనా, సమస్తం నిశ్శబ్దం, అయ్యే నేడిలా నువ్వే నా ప్రపంచం కదా...' అంటూ గాయపడిన ప్రేమికుడి బాధను వ్యక్తం చేస్తూ హార్ట్ టచింగ్ గా సాగుతుందీ పాట.

ఇవి కూడా చదవండి:

‘మా భూమి’ దర్శకుడు.. బి. నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్! గవర్నర్ చేతుల మీదుగా సత్కారం

తెలుగమ్మాయి.. చెన్నైకి వచ్చేయి

యాంకర్ ఫొటోలు మార్ఫింగ్.. అసభ్యకర పోస్టులు

Updated Date - Oct 08 , 2026 | 04:17 PM